సాధారణంగా మనం కొత్త ఇంటిని నిర్మించాలి అంటే అందుకు తగ్గ అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటాము.అదేవిధంగా వాస్తు ప్రకారం ఇంటి నమూనాను చిత్రీకరించి వాస్తు పద్ధతిలోనే ఇంటి నిర్మాణాన్ని చేపడతామని.
మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు వాస్తు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.మన ఇంట్లో అలంకరణ వస్తువులను సైతం వాస్తు ప్రకారమే అమర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
అయితే కొందరు కొన్ని సార్లు వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకున్న ఆ ఇంటి చుట్టు పరిసరాల వల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తుతుంటాయి.అయితే మన ఇంట్లో దక్షిణ భాగంలో కొలను, బావి, సరస్సు, పల్లం వంటివి ఉండకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఒకవేళ అలాంటివి కనుక మన ఇంటి దక్షిణ భాగంలో ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఇక్కడ తెలుసుకుందాం…
మన ఇంటి బయట దక్షిణభాగంలో పల్లం ఉన్నట్లయితే అనేకమైన సమస్యలు ఎదుర్కోవడంతో పాటు అధిక నష్టాలను చవిచూసే ప్రమాదం ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.మన ఇంటి నిర్మాణం ఈ విధంగా చేపట్టడం వల్ల ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటారు.
అదే విధంగా అధిక మొత్తంలో ధన నష్టం వాటిల్లుతుంది.ధనం కోసం అయిన వారిని, కానీ వారిని అప్పు అడగాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.
అదేవిధంగా ఇలాంటి ఇంటిలో నివసించేవారికి ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.అదేవిధంగా వృత్తి, వ్యాపార రంగాలలో ఉన్న వారికి తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటారు.
మానసిక ఆందోళనలు కుటుంబ వ్యక్తుల పై అనుమానాలు, మనస్పర్థలు తలెత్తాయి.అదేవిధంగా ఇలాంటి ఇంటిలో నివసించే మహిళలు ఎంతో బాధపడుతుంటారు.
వారి మొహంలో చిరునవ్వు కనుమరుగైపోయి ఎప్పుడు కన్నీటి దారలు ఏర్పడి ఉంటాయి.అదేవిధంగా ఆ కుటుంబం చిన్నపిల్లల పై ఎటువంటి ప్రేమానురాగాలను చూపించే పరిస్థితులు ఏర్పడవు.
ఈ విధంగా దక్షిణభాగంలో కొలను, బావి, సరస్సు ఉన్నట్లయితే ఆ కుటుంబంలో కష్టాలు తప్పవని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.