ఖమ్మం పట్టణంలో కిలాడి లేడీ.. పనిమనిషిపై అతిథులతో నీచంగా.. ?

ఆడవారికి ఆడవారే శత్రువులంటారు.పాపపుణ్యాల మాట దేవుడెరుగు కానీ కొందరు ఆడవారు సాటి ఆడవారి పట్ల చేసే నీచమైన పనులు, ప్రవర్తన చూస్తే అసలు వీళ్లు ఆడవారేనా అనే అనుమానం కలుగుతుంది.

 Lady Owner Recorded Maid Rape Video, Khammam, Lady Owner, Recorded Video, Maid R-TeluguStop.com

మాయం అవుతున్నాడమ్మ మనిషన్న వాడు అనే పాటలో చెప్పినట్లుగా, లోకంలో నిజంగానే మనుషులు మాయం అయ్యి, ఆ రూపంలో మృగాలు సంచరిస్తున్నాయి.

కనీసం ఆకలేస్తేనే మృగాలు వేటాడుతాయి.

కానీ మనుషులు మాత్రం అలా కాదు.ఖమ్మంలో జరిగిన ఈ దారుణ సంఘటన గురించి తెలుసుకుంటే నిజమే అనిపిస్తుంది.

ఆ వివరాలు చూస్తే.ఖమ్మం పట్టణంలోని టీచర్స్‌ కాలనీకి చెందిన కాల్వ కళావతి అనే కిలాడి ఇంట్లో ఓ మహిళ పనిమనిషిగా పనిచేస్తోంది.

అయితే జనవరి 13న కళావతి ఇంటికి నలుగురు వ్యక్తులు రాగా వారి కంటిలో పడిన పనిమనిషిని ఎలాగైనా లొంగదీసుకోవాలని భావించిన ఆ దుర్మార్గులు ఈ విషయాన్ని కళావతితో చెప్పగా అందుకు ఆమే అంగీకరించిందట.

ఇక తన పని ముగించుకుని తన ఇంటికి వెళ్లుతున్న పనిమనిషి చేత మత్తు కలిపిన టీ తాగించి స్పృహ కోల్పోయేలా చేసి సయ్యద్‌ హుస్సేన్‌ అత్యాచారానికి పాల్పడగా, ఆ దృష్యాలను కళావతి వీడియో తీసిందట.

కాసేపటి తర్వాత తేరుకున్న బాధితురాలు జరిగిన దారుణాన్ని గ్రహించగా ఈ విషయాన్ని బయటకు చెబితే వీడియో ఇంటర్నెట్‌లో పెడతానని, ఇలా చేయవద్దంటే రూ.5లక్షలివ్వాలంటూ కళావతి బెదిరించిందట.దీంతో విసిగిపోయిన బాధితురాలు ఖమ్మం పోలీసులకు ఫిర్యాదు చేయగా కళావతి పెద్ద ఫ్రాడ్, కిలాడిలేడి అని తేలిందట.ఇంతకు ముందు కూడా ఇలాంటి నేరాలు చేసిందని పేర్కొన్న పోలీసులు నిందితులపై చర్యలకు ఉపక్రమించారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube