అతి సులువైన మరియు అద్భుతమైన వ్యాయామాల్లో `వాకింగ్` ఒకటి.అందుకే ప్రతి రోజు కనీసం ఇరవై నిమిషాలు అయినా వాకింగ్ చేయాలని ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతారు.
అయితే వాకింగ్ కన్నా బ్రిస్క్ వాకింగ్‌తో మరిన్ని హెల్త్ మరియు బ్యూటీ బెనిఫిట్స్‌ను పొందొచ్చు.ఇంతకీ బ్రిస్క్ వాకింగ్ అంటే ఏమిటి అన్న సందేహం చాలా మందికి రావొచ్చు.
ఫాస్ట్‌గా నడవడాన్నే బ్రిస్క్ వాకింగ్ అని అంటారు.క్లియర్ కట్‌గా చెప్పాలంటే పరుగులాంటి నడక అన్నమాట.
అవును, మామూలుగా నడవడం కంటే ఫాస్ట్‌గా నడవడం వల్ల మోర్ బెనిఫిట్ పొందొచ్చు.మరి ఆ బెనిఫిట్స్ ఏంటీ అన్నది లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.రోజుకు కనీసం ఇరవై నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల త్వరగా బవువు తగ్గొచ్చు.బ్రిస్క్ వాకింగ్ వల్ల శరీరంలో ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి.
అదే సమయంలో శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది.ఫలితంగా బరువు తగ్గొచ్చు.
బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల కండరాలు, ఎముకలు దృఢంగా మారుతాయి.
అలాగే రెగ్యులర్‌గా ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది.దాంతో గుండె పోటు మరియు ఇతర గుండె సంబంధిత జబ్బులకు దూరంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి, డిప్రెషన్ సమస్యలతో బాధ పడేవారు ప్రతి రోజు బ్రిస్క్ వాకింగ్ చేయడం చాలా మంచిది.
ఎందుకంటే, మూడ్‌ను చేంజ్ చేయడంలో, అధిక ఒత్తిడి, డిప్రెషన్ సమస్యలను తగ్గడంలో బ్రిస్క్ వాకింగ్ గ్రేట్‌గా సహాయపడుతుంది.
అలాగే మధుమేహం వ్యాధి గ్రస్తులు భోజనం చేసిన అరగంట తర్వాత బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇక బ్రిస్క్ వాకింగ్ వల్ల బ్రెయిన్ యాక్టివ్ గా మారడంతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన జబ్బులకు కూడా దూరంగా ఉండొచ్చు.