దేశంలో రోజురోజుకు పురుషుల జనాభాతో పోలిస్తే స్త్రీల జనాభా పెరిగిపోతుంది.దీంతో చాలామంది పెళ్లి చేసుకోకుండానే బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు.
అయితే ఒక వ్యక్తి మాత్రం ఏకంగా ముగ్గురు యువతులను పెళ్లి చేసుకున్నాడు.ముగ్గురు యువతులను పెళ్లి చేసుకోవడంలో వింతేమీ లేకపోయినా ఆ ముగ్గురు యువతులు అక్కాచెల్లెళ్లు కావడం గమనార్హం.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.తన భర్తను వేరే అమ్మాయి చూస్తేనే తట్టుకోలేని అమ్మాయిలు ఉన్న ప్రస్తుత కాలంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే వ్యక్తిని చేసుకోవడం వెనుక అసలు కారణం వేరే ఉంది.
సొంత అక్కాచెల్లెళ్లు అయిన ముగ్గురు యువతులు చిన్నప్పటి నుంచి ఒకరు ఏ పని చేస్తే మిగతా వాళ్లు కూడా అదే పనిని చేసేవాళ్లు.ఈ విషయం ఆ విషయం అనే తేడాల్లేకుండా అన్ని విషయాల్లోనూ ఇదే విధంగా వ్యవహరించేవాళ్లు.
ముగ్గురు యువతులు పెళ్లీడుకు రావడంతో వాళ్ల తల్లిదండ్రులు పెళ్లి చేస్తామని చెప్పగా ముగ్గురు యువతులు ఒకే యువకుడిని పెళ్లి చేసుకుంటామని పట్టు బట్టి ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.చాలా సంవత్సరాల క్రితమే వీళ్ల పెళ్లి జరగగా ముగ్గురు అక్కాచెల్లెళ్లు భర్తతో అన్యోన్యంగా మెలుగుతున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.కలియుగ కృష్ణ అని పేరు తెచ్చుకున్న ఈ యువకుని అసలు పేరు కూడా కృష్ణనే కావడం గమనార్హం.
కర్వా చౌత్ పండగ సందర్భంగా వీళ్లు ఫోటోలు దిగగా ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.తమ భర్త నిండు నూరేళ్లు క్షేమంగా జీవించాలని ముగ్గురు భార్యలు చంద్రునికి పూజలు చేశారు.
సోషల్ మీడియాలో వీళ్ల ఫోటోలు వైరల్ అవుతుండగా నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.