అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు కేవలం 10 రోజుల సమయం మాత్రమే మిగిలిఉంది.ఇరు పార్టీల అభ్యర్ధులు తమ ప్రచారాల్లో తలమునకలై ఉన్నారు.
అమెరికన్స్ ని ఆకట్టుకోవడానికి, వారి మద్దతు పొందటానికి ట్రంప్, బిడెన్ ఇరువురు చేయని ప్రయత్నాలు లేవు.ఒక పక్క హామీలతో మరో పక్క రాజకీయ ఎత్తుగడలతో అభ్యర్ధులు ఇరువురు అతి పెద్ద యుద్దమే చేస్తున్నారు.
ఇదిలాఉంటే గత ఎన్నికల్లో జరిగినట్ట్టుగానే ఈ ఎన్నికల్లో కూడా ఇతర దేశాల జోక్యం ఉండబోతోందని, అమెరికన్స్ ఓట్లపై వారి ప్రభావం మళ్ళీ కనిపించనుందని హెచ్చరికలు జారీ చేశాయి అమెరికా నిఘావర్గాలు.
ఈ ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి ట్రంప్ గనుకా వస్తే తమకి తీవ్ర నష్టమని భావిస్తున్న పలు దేశాలు ట్రంప్ కి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని అంటున్నారు.
ముఖ్యంగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు రష్యా, ఇరాన్ లు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు.కేవలం మరో 10 రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో డెమోక్రటిక్ పార్టీ ఓటర్లకు అనుమానాస్పద ఈమైల్స్ వచ్చాయని వారు స్పష్టం చేశారు.
ఓటర్ల ని బెదిరిస్తున్నట్టుగా వచ్చిన ఈ మెయిల్స్ వారి పనేనని అనుమానాలు వ్యక్తం చేశారు.
ట్రంప్ కి ఓటు గనుక వేయకపోతే మీ అంతు చూస్తాం,ఎన్నికలు అయ్యిన తరువాత మీకు తగిన బుద్ది చెపుతాము అంటూ బెదిరింపు ఈ మెయిల్స్ కొన్ని రోజుల క్రితం వచ్చిపడ్డాయి.
ఈ సందేశాలు అన్నీ ప్రౌడ్ బాయ్ అనే సంస్థ నుంచీ వచ్చినట్టుగా గుర్తించారు.ఈ మెయిల్స్ పై లోతైన విచారణ చేపట్టిన ఇంటిలిజన్స్ ఇవన్నీ ఇరాన్ నుంచీ వచ్చినట్టుగా సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.
ట్రంప్ అధికారంలోకి వస్తే తమకి తీవ్ర నష్టం తప్పదని భావించిన ఇరాన్ ట్రంప్ ఓటమి కోసం ఇలాంటి మెయిల్స్ సృష్టిస్తోందని ఇంటిలిజెన్స్ అధికారులు ఆరోపించారు.