సూపర్ స్టార్ రజనీకాంత్ పై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ రజనీకాంత్ ప్రాపర్టీ రాఘవేంద్ర కళ్యాణ మండపంపై ఆరున్నర లక్షల రూపాయల పన్ను విధించగా పన్నుకు వ్యతిరేకంగా రజనీకాంత్ కోర్టును ఆశ్రయించారు.
రజనీ పన్ను చెల్లించకుండా కోర్టును ఆశ్రయించడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.ప్రభుత్వానికి పన్నును సక్రమంగా చెల్లించాలని.
పన్ను చెల్లింపుల విషయంలో కోర్టును ఆశ్రయించరాదని సూచించింది.కోర్టును మరోసారి చెల్లించాల్సిన పన్నుకు వ్యతిరేకంగా ఆశ్రయిస్తే జరిమానా విధిస్తామని హైకోర్టు తీవ్ర స్థాయిలో హెచ్చరించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే చెన్నైలోని కొడుంబాకం ప్రాంతంలో ఉన్న రాఘవేంద్ర కళ్యాణ మండపం రజనీకాంత్ కు చెందినది.కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల మార్చి నెల 24వ తేదీ నుంచి ఆ కళ్యాణ మండపం మూసి ఉంది.మూసి ఉన్న కళ్యాణ మండపానికి అధికారులు 6.5 లక్షల రూపాయల పన్ను చెల్లించాలంటూ రజనీకాంత్ కు నోటీసులు జారీ చేశారు.
అయితే లాక్ డౌన్ సమయంలో కళ్యాణ మండపానికి ఎటువంటి ఆదాయం లేకపోవడం పన్ను చెల్లించడం సరికాదని భావించి రజనీకాంత్ కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ అనిత సుమంత్ ఈ పిటిషన్ ను విచారించి రజనీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు.
కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో రజనీకాంత్ తరపు న్యాయవాది పిటిషన్ ను వెనక్కు తీసుకోవడానికి కొంత సమయం కావాలని కోర్టును కోరారు.
పన్ని చెల్లింపులకు వ్యతిరేకంగా రజనీకాంత్ కోర్టును ఆశ్రయించడంపై తమిళనాడు ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు రజనీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్తే సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాలో గ్రామ సర్పంచ్ గా కనిపించనున్నారు.
వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.