వేస‌విలో ఈ ష‌ర్బ‌త్ తాగితే ఒంట్లో వేడి, కొవ్వు రెండు త‌గ్గుతాయి!

ప్ర‌స్తుతం వేస‌వి కాలం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.రోజురోజుకు దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి.

 Drinking This Sharbat In Summer Will Reduce Both Heat And Fat! Sharbat, Body Hea-TeluguStop.com

బయటకు వెళ్లాలంటేనే ప్రజలు వెన‌క‌డుగు వేస్తున్నారు.ఇలాంటి వాతావరణంలో శ‌రీరాన్ని కూల్‌గా మార్చుకునేందుకు, అధిక వేడిని తొల‌గించుకునేందుకు తెగ ఆరాట‌ప‌డుతూ ఉంటారు.

అయితే అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే ష‌ర్బ‌త్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి ఆ ష‌ర్బ‌త్ ఏంటో.

ఎలా త‌యారు చేసుకోవాలో.ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని వ‌న్ టేబుల్ స్పూన్ స‌బ్జా గింజలు, వాట‌ర్ పోసి నానబెట్టుకోవాలి.ఆ త‌ర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల సోంపు, మూడు టేబుల్ స్పూన్ల బెల్లం తురుము, మూడు యాల‌కులు, ఎనిమిది మిరియాలు వేసి మెత్త‌గా పొడి చేసుకోవాలి.

ఈ పొడిని ఒక గాజు సీసాలో నింపి స్టోర్ చేసుకుంటే.దాదాపు ప‌దిహేను రోజుల పాటు వాడుకోవ‌చ్చు.

ఇక ఇప్పుడు ష‌ర్బ‌త్ కోసం ఒక జార్‌ తీసుకుని అందులో త‌యారు చేసి పెట్టుకున్న‌ సోంపు-బెల్లం పొడి వ‌న్ టేబుల్ స్పూన్‌, గ్లాస్ వాట‌ర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై అందులో నాన‌బెట్ట‌కున్న స‌బ్జా గింజ‌ల‌ను కూడా వేసి క‌లిపితే.

ష‌ర్బ‌త్ సిద్ధం అవుతుంది.ప్ర‌స్తుత వేస‌వి కాలంలో ఈ సోంపు ష‌ర్బ‌త్‌ను రోజు ఒక గ్లాస్ చ‌ప్పున తీసుకుంటే.

అధిక వేడి తొల‌గిపోయి బాడీ కూల్‌గా మారుతుంది.

Telugu Fennelseeds, Tips, Latest, Sharbat-Telugu Health Tips

అలాగే శ‌రీరంలో పేరుకుయిన కొవ్వు క‌రిగిపోతుంది.ఒత్తిడి, త‌ల‌నొప్పి, ఆందోళ‌న వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.బాడీ రీఫ్రెష్‌గా మారుతుంది.

అధిక దాహం సమ‌స్య త‌గ్గు ముఖం ప‌డుతుంది.మ‌రియు శ‌రీరం డీహైడ్రేట్ అవ్వ‌కుండా కూడా ఉంటుంది.

కాబ‌ట్టి, ప్ర‌స్తుత స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో ఈ టేస్టీ సోంపు ష‌ర్బ‌త్‌ను ఖ‌చ్చితంగా ట్రై చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube