ఏదైనా ఒక మాట అనుకుంటే కొన్ని రోజుల వరకు గుర్తు ఉంటుంది.ఆ తర్వాత గుర్తు ఉంటుందో లేదో కూడా ఎవరికీ తెలియదు.
అది ఓ ఫోటో తీసుకుంటే మీ జీవితాంతం ఆ ఫోటో చూస్తున్నప్పుడల్లా మీ జ్ఞాపకాలు గుర్తు వస్తూనే ఉంటాయి.మీ చిన్ననాటి నుండి దిగిన ఫోటోలు కానీ, ఏవైనా అందమైన ప్రదేశాల జ్ఞాపకాలు కానీ అన్నిటినీ ఆ ఫోటో రూపంలో పొందుపరిచి ఉంటే ఆ ఫోటో చూసినప్పుడు మీ బాల్యం, మీరు ఆస్వాదించిన ప్రకృతి అంతా మీకు కనబడుతుంది.
అయితే ఈ ఫోటోగ్రఫీ కి సంబంధించిన ఓ ప్రక్రియ అయిన ‘ డాగ్యుర్రియో టైప్ ‘ అనే విధానాన్ని కనుగొనడం ద్వారా ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ఇకపోతే ఈ ఫోటో పక్రియకి సంబంధించి మొదటి కాలంలో కలర్ ఫోటోగ్రఫీ పై అనేక పరిశోధనల నేపథ్యంలో, చాలా ఎక్కువ సమయం తీసుకునే ఎక్స్పోజర్ లు అవసరమయ్యేవి.
అంతే కాదు ఆ సమయంలో కలర్ ఫోటో వచ్చినా కానీ, అది ఎక్కువ రోజులు ఉండేలా లేదు.ఇక ఆపై 1861 లో మొట్టమొదటి శాశ్వత కలర్ ఫోటో ని తీయగలిగారు.
అది కూడా ఒకే వస్తువుని మూడు వేరు వేరు బ్లాక్ అండ్ వైట్ ఫోటో లను ఆకుపచ్చ, నీలం, ఎరుపు కలర్ ఫీడర్ల ద్వారా తీసాక వాటిని ఉపయోగించి మొట్టమొదటి కలర్ ఫోటోగ్రాఫ్ ని సృష్టించారు.
ఇక ఆ తర్వాత 1936 సంవత్సరంలో అగ్ఫా యొక్క ఆగ్ఫా కలర్ న్యూ యొక్క ఆధార కలర్ రూపొందించడం ద్వారా ఫిలిం తయారీ సమయంలోనే పొరల మిశ్రమంలో కలర్ కప్లర్ లని జోడించడంతో తీసిన ఫోటోలకు రంగులు అద్దె ప్రక్రియ మరింత సులభంగా మారింది.ప్రస్తుత జనరేషన్ లో కూడా ఉపయోగించే కలర్ ఫోటోల టెక్నాలజీ ఇంచుమించుగా ఈ అగ్ఫా కలర్ న్యూ టెక్నాలజీ కి పోలి ఉంటాయి.1963 లో పూర్తి స్థాయి కలర్ ప్రింట్ కలిగిన కెమెరాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.