తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, తదితర భాషలలో ఎన్నో విభిన్న పాత్రలలో నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న “సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్” గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారు ఉండరు.పాత్ర ఏదైనా సరే అందుకు తగ్గట్టుగా ఒదిగిపోయి ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకోవడం ప్రకాష్ రాజ్ యొక్క స్పెషాలిటీ.
అయితే తాజాగా ప్రకాష్ రాజ్ ఈ కరోనా కాలంలో కష్టాలు పడుతున్న వారికి సహాయం అందిస్తున్న ప్రముఖ నటుడు సోనూ సూద్ చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాల పై స్పందించారు.
ఇందులో భాగంగా ప్రస్తుత కాలంలో కొంతమంది డబ్బున్న వ్యక్తులకి కష్టాలు ఎదుర్కొంటున్న వారికి సహాయం చేయాలని ఉన్నప్పటికీ తమ సహాయ సహకారాలను అందించే విధానం తెలియక పోవడంతో చాలా మంది వెనకడుగు వేస్తున్నారని తెలిపాడు.
కానీ నటుడు సోనూసూద్ మాత్రం కష్టాలు పడుతున్న టువంటి వారి వివరాలు తెలుసుకొని ప్రత్యక్షంగా వారికి సహాయం అందించడం హర్షించ దగ్గ విషయమని ప్రశంసలు కురిపించాడు.అంతేగాక తనకు కూడా కొంతమంది డబ్బున్న వ్యక్తులు ఈ కరోనా వైరస్ కాలంలో నిరాశ్రయులైన వారికి సహాయం అందించేందుకు డబ్బులు పంపించారని తెలిపాడు.
అంతేగాక క ఇతరుల కష్టాలను తమ కష్టాలు గా భావించి సరైన సమయంలో వారికి సహాయం అందిస్తే వారికి చాలా మేలు చేసిన వారమవుతామని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే సోనూసూద్ పొట్ట కూటి కోసం రోడ్డుపై కర్రసాము చేస్తున్నటువంటి ఓ వృద్ధ మహిళ వీడియోని చూసి చలించిపోయి ఆమె ద్వారా మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ తో రక్షణ కల్పించుకునే ఏర్పాటు చేస్తూ ఉపాధి కల్పించాడు.
అంతేగాక లక్షల మంది కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో తమ స్వస్థలాలకు చేరుకోవడానికి తన సొంత ఖర్చులతో బస్సులను మరియు విమానాలను ఏర్పాటు చేసి రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నాడు.