విద్యా విధానాన్ని మార్చేస్తూ కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది.మూడు దశాబ్దాల తర్వాత దేశంలో విద్యా విధానం మారనుంది.
నాలుగు దశల్లో నూతన విద్యావిధానం ఉంటుందని కేంద్రం ప్రకటించింది.విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపోందించే దిశగా అడుగులు వేసింది.మానవ వనరుల శాఖ పేరును విద్యాశాఖగా మార్చింది.3 నుంచి 18 ఏళ్ల వరకు ఉచిత, నిర్బంధ విద్యను అమలు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.దీంతో రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి స్కూల్ రెగ్యూలేటరీ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. 21వ శతాబ్దపు సవాళ్లను అధిగమించడానికి ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
నాలుగు దశలు 5,3,3,4 అనే కొత్త విధానాలతో విద్యా వ్యవస్థ మారనుంది.మొదటి ఐదేళ్లు ఫౌండేషన్ కోర్సులుగా పరిగణిస్తారు.
ఇందులో మూడేళ్లు ప్రీ ప్రైమరీతో పాటు గ్రేడ్-1, గ్రేడ్-2 లు ఉంటాయి.మరో మూడేళ్లు ప్రిపరేటరీ పీరియడ్ గా ఇందులో గ్రేడ్-3, గ్రేడ్-4, గ్రేడ్-5లుగా పరిగణిస్తారు.
మళ్లీ వచ్చే మూడేళ్లను మిడిల్ స్టేజ్ గా అందులో గ్రేడ్-6, గ్రేడ్-7, గ్రేడ్-8 వరకు ఉంటాయి.నాలుగేళ్లను హై స్టేజ్ గా పరిగణిస్తారు.
ఇందులో గ్రేడ్-9 నుంచి గ్రేడ్-12 ఉంటాయి.మౌలిక పాఠ్యాంశాల మేరకు సిలబస్ ను చెప్పి, అప్లికేషన్ ఆధారిత విద్యా విధానం అమలు చేయనుంది.దీంతో త్రిభాషా సూత్రాన్ని కొనసాగించనుంది.
కేంద్రం 1990లో చివరిసారిగా విద్యా విధానాన్ని మార్చింది.దాదాపు 30 ఏళ్ల తర్వాత కొత్త పాలసీ తీసుకొస్తోంది.గ్రేడ్-8 వరకు మాతృబాషలోనే విద్యను బోధించనున్నారు.ఆరో తరగతి నుంచి ఒకేషనల్ విద్య ఉంటుంది.డిప్లొమా కోర్సు ను రెండేళ్లు, వృత్తి విద్యా కోర్సులు ఏడాదికి కుదించనున్నారు.చదువుకు తగ్గట్లుగానే ఉపాధ్యాయులను కూడా ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ కలిగి ఉంటారు.