ఫోర్బ్స్ బిలియనీర్ల క్లబ్‌లోకి ఇన్‌స్టాకార్ట్ సీఈవో అపూర్వ మెహతా: 33 ఏళ్లకే అరుదైన ఘనత

ఏ దేశంలోనైనా జయకేతనం ఎగురవేయగలమని నిరూపిస్తున్నారు భారతీయులు.ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తూ భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెబుతున్నారు.

 Indian-origin Founder Of Instacart Apoorva Mehta Enters The Billionaires' Club:-TeluguStop.com

తాజాగా భారత సంతతికి చెందిన యువ పారిశ్రామిక వేత్త అరుదైన ఘనతను సాధించాడు. ఇన్‌స్టాకార్ట్ వ్యవస్థాపకుడు, సీఈవో అపూర్వ మెహతా ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ బిలయనీర్ల క్లబ్‌లో స్థానం సంపాదించారు.

ఇన్‌స్టాకార్ట్ తాజా ఫైనాన్సింగ్ రౌండ్ తర్వాత అపూర్వ నికర సంపద 1.2 బిలియన్ డాలర్లు.నిధుల సేకరణ ద్వారా మెహతా ఈ కంపెనీ విలువను 7.9 బిలియన్ డాలర్ల నుంచి 13.7 బిలియన్ డాలర్లకు పెంచినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది.33 ఏళ్ల మెహతా 2012లో శాన్‌ఫ్రాన్సిస్కోలో ఈ సంస్థను ప్రారంభించారు.ప్రస్తుతం ఫోర్బ్స్ అంచనా ప్రకారం.ఆయన ఇన్‌స్టాకార్ట్‌లో 10 శాతం వాటాను కలిగి వున్నారు.ఇదే సమయంలో ఇన్‌స్టాకార్ట్ యొక్క ఆర్డర్ విలువ గత 12 నెలల్లో 500 శాతం పెరగ్గా… కస్టమర్లు ఈ కంపెనీ కోసం చేసే ఖర్చు సైతం 35 శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.

భారతదేశంలో పుట్టిన అపూర్వ మెహతా కెనడాలో పెరిగారు.

ప్రఖ్యాత వాటర్లూ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు.ఇన్‌స్టాకార్ట్ ప్రారంభించడానికి ముందు, ఆయన అమెజాన్‌లో సప్లై చైన్ ఇంజనీర్‌గా .బ్లాక్‌బెర్రీ, క్వాల్కమ్‌లలో డిజైన్ ఇంజనీర్‌గానూ పనిచేశారు.2010లో అమెజాన్‌ నుంచి నిష్క్రమించిన తర్వాత మెహతా 20 స్టార్టప్‌లు ప్రారంభించి విఫలమయ్యారని లాస్ ఏంజిల్స్ టైమ్స్ 2017లో కథనాన్ని ప్రచురించింది.ఇన్‌స్టాకార్ట్‌కు మొట్టమొదటి కస్టమర్ అపూర్వ మెహతానే.యాప్‌లో ఆర్డర్‌ను బుక్ చేసుకున్న ఆయన తనకు తానుగా డెలివరీ చేసుకున్నారని ఫోర్బ్స్ వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube