తెలుగులో ప్రభాస్, రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్, రవితేజ, విక్టరీ వెంకటేష్, తదితర స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించినటువంటి ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలియని వారుండరు.అయితే ఈ అమ్మడు తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన మొదట్లో అవకాశాల కోసం కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పట్టువిడవకుండా ప్రయత్నించి హిట్ ను అందుకుంది.
అయితే ఈ మధ్య కాలంలో మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగులు లేకపోవడంతో సోషల్ మీడియా మాధ్యమాలను బాగానే యాక్టివ్ గా ఉంటోంది.
అయితే తాజాగా ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి హలో ద్వారా తన అభిమానులతో ముచ్చటించింది.
ఇందులో భాగంగా కొందరు నెటిజన్లు అడిగినటువంటి పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.అయితే ఇందులో ఓ నెటిజన్ టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వ్యక్తిత్వం గురించి తెలియజేయాలని కోరాడు.
దీంతో తమన్నా స్పందిస్తూ ప్రభాస్ చాలా కష్టపడే తత్వం కలవాడని, అంతేగాక పాత్రకి నచ్చినట్లుగా తనని తాను తయారుచేసుకోవడం, ఎంతటి కష్టతరమైన డైలాగులను అయినా సరే సాధన చేసి షాట్ రెడీ అయ్యే సమయానికి సిద్ధంగా ఉంటాడని చాలా బాధ్యతగా వ్యవహరిస్తాడని చెప్పుకొచ్చింది.అలాగే ప్రభాస్ కి తన లేడీ ఫ్యాన్స్ ని చూస్తే తెగ సిగ్గు పడుతాడాని కూడా సరదాగా నవ్వుతూ తెలిపింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న సీటీమార్ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.అయితే ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ చిత్రంలో తమన్నా ఓ ప్రముఖ కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించినటువంటి పలు పోస్టర్లు కూడా విడుదలయి మంచి ప్రేక్షకాదరణ పొందాయి.