భార్యను డెలివరీ కోసం ఇండియాకు పంపించి.. నిద్రలోనే భర్త మృతి

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా అన్ని దేశాల మధ్య అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో గర్భవతిగా ఉన్న తనను భారతదేశానికి వచ్చేందుకు అనుమతించాలని కోరుతూ దుబాయ్‌లో స్థిరపడిన ఓ వివాహిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన వ్యవహారం పాఠకులకు గుర్తుండే వుంటుంది.

 Month After Sending Pregnant Wife Repatriated To India, Man Dies In Dubai,nithin-TeluguStop.com

ఆ మహిళ భర్త దుబాయ్‌లో కన్నుమూశారు.

వివరాల్లోకి వెళితే.

కేరళకు చెందిన నితిన్ చంద్రన్ అనే వ్యక్తి దుబాయ్‌లోని కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.అతని భార్య అతిరా గీతా శ్రీధరన్ గర్భవతి.

నితిన్ చంద్రన్ నిర్మాణ రంగంలో పనిచేస్తుండటం వల్ల… కరోనాతో విధించిన లాక్‌డౌన్‌లో ఈ రంగానికి మినహాయింపు ఇవ్వలేదు.ఇదే సమయంలో అతిరా సంరక్షణ బాధ్యతలు చూసేవాళ్లు ఎవరూ లేనందున తాను భారతదేశానికి రావడం అత్యవసరమని ఆమె భర్త ప్రోత్సాహంతో ఏప్రిల్‌లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

జూలైలో డెలివరీ జరగాల్సి వున్నందున మే మొదటి , రెండో వారాల్లో భారత్‌కు వస్తానని వాపోయింది.

కరోనా విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో తాను స్వస్థలానికి చేరుకోవడం అవసరమని పిటిషన్‌లో పేర్కొంది.

ఈ కేసు విచారణ జరుగుతుండగానే వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.దీనిలో భాగంగా ఆ మిషన్ ద్వారానే నితిన్ తన భార్య గీతాను మే 7న కేరళకు పంపించాడు.

అయితే తాను మాత్రం ఉద్యోగ పనుల వల్ల అక్కడే ఉండిపోయాడు.

ఈ క్రమంలో సోమవారం రాత్రి నిద్రలో ఉండగానే చంద్రన్‌కు అధిక రక్తపోటు కారణంగా గుండెపోటు వచ్చింది.

దీంతో ఆయన నిద్రలోనే చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు.కాగా నితిన్- గీతా దంపతులు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు.

వీరిద్దరూ బ్లడ్ డోనర్స్ కేరళ-యూఏఈ చాప్టర్‌లో సభ్యులు.అలాగే చంద్రన్ కేరళలోని ఎమర్జెన్సీ టీమ్ ఇంటర్నేషనల్ అనే వాలంటరీ గ్రూప్‌‌లోనూ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

మరణించడానికి కొన్ని గంటల ముందు కూడా తన స్వగ్రామంలో రక్తదానం చేయడానికి కొంతమందిని ఏర్పాటు చేసినట్లు నితిన్ స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube