నాలుగు రోజులలో 600 కోట్లు మద్యం.... తెలంగాణలో రికార్డ్

లాక్ డౌన్ కారణంగా 40 రోజులకి పైగా మద్యం విక్రయాలు పూర్తిగా నిలిపేసి మరల తెరిచారు.అయితే మందుబాబులు అసలే ఆకలితో ఉండటంతో ఉన్నపళంగా వెళ్లి వైన్ షాపుల మీద పడ్డారు.

 600 Crores Collection Within Four Days With Liquor In Telangana, Lock Down, Coro-TeluguStop.com

లాక్ డౌన్ కారణంగా సామాజిక దూరం పాటించాలనే నిబంధనలు ఉన్న వాటిని లెక్క చేయకుండా వైన్ షాపుల ముందు మందు కోసం క్యూలు కడుతున్నారు.ధరలు పెంచిన ఏ మాత్రం లెక్క చేయకుండా మద్యం కొనుగోలు చేసి ఇళ్ళకి తరలిన్చేస్తున్నారు.

మళ్ళీ పరిస్థితి ఎలా ఉంటుందో అని ముందుగానే ఎక్కువగా కొనేస్తున్నారు.ఇక ఏపీలో మద్యం ధరలని 75 శాతం పెంచేశారు.

అయిన కూడా మందుబాబులు కొనడానికి వెనకాడటం లేదు.మందుబాబులని కరోనా కూడా భయపెట్టడం లేదు.

ఇక తెలంగాణలో మద్యం అమ్మకాలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.అక్కడ గ్రామీణ ప్రాంతాలలో గుడుంబా తాగేవారు ఎక్కువగా ఉంటారు.వారి జీవనశైలిలో మద్యం ఒక భాగం అయిపొయింది. ఆడ,మగ ఇద్దరు తాగుతారు.

దాదాపు 40 రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మందుబాబులు పోటెత్తుతున్నారు.గత నాలుగు రోజుల్లో ఏకంగా 600 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు తెలుస్తోంది.

నిన్న ఒక్క రోజే మద్యం డిపోల నుంచి 149 కోట్ల అమ్మకాలు జరిగాయి.ఈ నెల 6న 72.5 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, 7న రూ.188.2 కోట్లు, 8న 190.47 కోట్ల విలువైన విక్రయాలు జరిగినట్టు సమాచారం. అంటే మొత్తంగా 600 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని తెలుస్తుంది.మద్యం ధరలు పెంచిన అది కేవలం 15 శాతం మాత్రమే ఉంది.మిగిలిన రాష్ట్రాలలో అయితే భారీగా పెంచారు.అందుకే అక్కడ డిమాండ్ తగ్గగా, తెలంగాణలో డిమాండ్ విపరీతంగా పెరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube