అల్లుడు అదుర్స్‌ సక్సెస్‌ గ్యారెంటీ.. కారణం ఇదేనట

అల్లుడు శీను చిత్రంతో పరిచయం అయిన బెల్లంకొండ శ్రీనివాస్‌ ప్రస్తుతం సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో అల్లుడు అదుర్స్‌ చిత్రంతో రెడీ అవుతున్న విషయం తెల్సిందే.కందిరీగ, రభస చిత్రాలతో దర్శకుడిగా మంచి మార్కులు దక్కించుకున్న దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ తదుపరి సక్సెస్‌ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాడు.

 Alludu Adhursu Success Gurante The Reason Is Kandhiriga Movie Sentiment, Santhos-TeluguStop.com

మళ్లీ ఈ సినిమాతో సక్సెస్‌ కొట్టడం ఖాయం అన్నట్లుగా నమ్మకంగా ఉన్నాడు.ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకంతో యూనిట్‌ సభ్యులు ఉన్నారు.

ప్రస్తుతం సినిమా షూటింగ్‌ లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయింది.షూటింగ్‌ యధావిధిగా పూర్తి అయ్యి ఉంటే సమ్మర్‌ చివరి వరకు సినిమా విడుదల అయ్యే అవకాశం ఉండేది.కాని సినిమా ఎప్పటికి ప్రేక్షకుల ముందుకు వస్తుందో తెలియని పరిస్థితి.అయినా కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు.

ఎందుకంటే ఈ సినిమా కందిరీగ సెంటిమెంట్‌తో రూపొందుతుందట.అదే కథను కాస్త అటు ఇటుగా మార్పులు చేర్పులు చేసి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోడిచ్చి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ సినిమాను దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ తెరకెక్కిస్తున్నాడట.

Telugu Alludu Adhursu, Bellamkonda, Kandhireega, Sonu Soodh, Tollywood-Movie

కందిరీగ సినిమాలో మాదిరిగా ఈ సినిమాలో కూడా విలన్‌గా సోనూసూద్‌ నటిస్తున్నాడు.అలాగే ఈ సినిమాలో కందిరీగ సినిమాలో తరహాలో ఇద్దరు ముద్దుగుమ్మలు నటించబోతున్నారు.ఇలా అన్ని సెంటిమెంట్స్‌ కలిసి వస్తున్న కారణంగానే ఈ సినిమా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుంటుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.ఈ చిత్రం సక్సెస్‌ అయితేనే దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌కు తదుపరి చిత్రం ఛాన్స్‌ వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

మరి అల్లుడు అదుర్స్‌ సక్సెస్‌ అయ్యి వీరిద్దరికి కెరీర్‌లో ముందుకు వెళ్లేలా బూస్ట్‌ ఇస్తుందా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube