కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మీద పబ్ లో దాడి జరిగిన సంగతి తెలిసిందే.ఈ దాడిలో ఓ ఎమ్మెల్యే తమ్ముడు రాహుల్ ని బీర్ బోటిల్ తో గాయపరిచాడు.
దీనిపై రాహుల్ పోలీసులకి కూడా ఫిర్యాదు చేశాడు.అయితే ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.
అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో అతనిపై పోలీసులు ఇంకా చర్యలు తీసుకోలేదని టాక్ వినిపిస్తుంది.మంత్రి కేటీఆర్ కి సైతం రాహుల్ ట్విట్టర్ లో మెసేజ్ పెట్టాడు.
దానికి కూడా సమాధానం లేదు.దీనిపై తనకి న్యాయం జరిగే వరకు పోరాడుతా అని రాహుల్ చెబుతున్నాడు.
ఇప్పుడు రాహుల్ కు సపోర్ట్ గా సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ వచ్చాడు.ఆ రోజు పబ్ లో జరిగిన గొడవలో రాహుల్ సిప్లిగంజ్ తప్పేం లేదని సర్టిఫికెట్ ఇచ్చాడు ప్రకాష్ రాజ్.
ఆ గొడవలో తప్పు మొత్తం అవతలివారే చేశారని, ఎంత పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే అంటున్నాడు.ఇదే విషయంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ను కూడా ప్రకాష్ రాజ్, రాహుల్ సిప్లిగంజ్ అసెంబ్లీ కలిశారు.
కేసును కొట్టేసి.కాంప్రమైజ్ కావాలని ఒత్తిడి చేసినా కూడా అలాంటిదేం జరగదని ప్రకాష్ రాజ్ చెప్పడం విశేషం.
రాహుల్ తప్పు చేయనపుడు ఎందుకు కాంప్రమైజ్ కావాలని ప్రశ్నిస్తున్నారు.