బాగా చదువుకుని జీవితంలో స్థిరపడతాడని తల్లిదండ్రులు అమెరికా పంపిస్తే ఓ భారతీయ విద్యార్ధి అత్యాచారం కేసులో 10 ఏళ్ల పాటు కటకటాలపాలయ్యాడు.సచిన్ అజీ భాస్కర్ అనే భారతీయ విద్యార్ధి స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్లి, న్యూయార్క్ బఫెలో సిటీలో నివసిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో భాస్కర్ ఓ 11 ఏళ్ల మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురిచేశాడు.తనతో శృంగారంలో పాల్గొనాల్సిందిగా ఈ మెయిల్, సోషల్ మీడియా ద్వారా తెలిపేవాడు.
ఆగస్టు 2018లో ఓ రోజు బాలికను కారులో ఎక్కించుకుని ఆమెపై మూడు గంటల పాటు లైంగిక దాడి జరిపి తిరిగి ఇంటికి చేరుకున్నాడు.అయితే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చైల్డ్ ఎక్స్‌ప్లోయిటేషన్ టాస్క్‌ఫోర్స్ జరిపిన దర్యాప్తులో భాస్కర్ దురాగతం తేలింది.
పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించడంతో అతనికి కనీసం 10 సంవత్సరాలు గరిష్టంగా జీవిత ఖైదు, 2,50,000 జరిమానా లేదా రెండూ పడే అవకాశం ఉందని యూఎస్ అటార్నీ జేమ్స్ పి కెన్నెడీ అన్నారు.తదుపరి విచారణను న్యాయస్థానం జూన్ 17కు వాయిదా వేసింది.అప్పటి వరకు భాస్కర్‌ను నిర్బంధంలో ఉంచాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.