కిట్లు లేవంటూ ప్రకటించిన వైట్ హౌస్

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికా లో కూడా తీవ్ర రూపం దాలుస్తుంది.అయితే కరోనా వైరస్ గురించి పరీక్షలు నిర్వహించేందుకు తమ దగ్గర కావాల్సినన్ని కిట్లు లేవంటూ వైట్ హౌస్ తాజాగా వెల్లడించింది.

 Corona Virus Testing Kits Not Available In America-TeluguStop.com

అమెరికాలో క‌రోనా వైర‌స్ సోకిన వ్య‌క్తులు సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న‌ది.వారంలోగా ప‌దిల‌క్ష‌ల టెస్టింగ్ కిట్ల‌ను అందివ్వ‌డం వీలుకాదు అని ఉపాధ్య‌క్షుడు మైక్ పెన్స్ తెలిపారు.

దీనితో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 12 కు చేరుకున్నట్లు తెలుస్తుంది.మ‌హ‌మ్మారి క‌రోనాకు నియంత్రించేందుకు ఆ దేశ ఉభ‌య‌స‌భ‌లు మెడిక‌ల్ ఎయిడ్ కోసం ఎమ‌ర్జెన్సీ నిధుల‌ను రిలీజ్ చేసింది.

చైనా లో మొదలైన ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచదేశాలకు కూడా పాకింది.ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైర‌స్ సోకిన వారి సంఖ్య 92 వేల‌కు చేరుకున్న‌ది.

చైనాలోనే 80 వేలు దాటడం గమనార్హం.మరోపక్క ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ కరోనా మృతుల సంఖ్య 3200 దాటింది.

ఇట‌లీలో వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 148కి చేరుకోగా,ఇండియాలో వారి సంఖ్య 30కి చేరుకున్న‌ది.ద‌క్షిన కొరియాలో మ‌ర‌ణించిన వారి సంఖ్య 42కు చేరుకున్న‌ది.

చైనా క‌న్నా 17 రేట్ల అధిక వేగంతో ఇత‌ర దేశాల్లో క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా వెల్ల‌డించింది.దీనితో ప్రపంచదేశాలు అప్రమత్తమయ్యాయి.ఈ మహమ్మారి ని ప్రబలకుండా తగు చర్యలు చేపడుతుంది.అయితే తాజాగా అమెరికాలోని సియాటెల్‌లో 20 కేసులు న‌మోదు కాగా, రోడ్ ఐలాండ్‌లో సుమారు 200 మందిని క్వారెంటైన్ చేసినట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube