విలవిలలాడుతున్న 'దేశం' మరీ ఇంతగానా ?

ఘనమైన రాజకీయ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కుంటోంది.తెలంగాణాలో ఆ పార్టీ దాదాపు కనుమరుగయిపోగా ఇప్పుడు ఏపీలోనూ అదే పరిస్థితికి వచ్చేలా కనిపిస్తోంది.

 Tdp Party Struggles-TeluguStop.com

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ రాజకీయంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కుంటూ వస్తోంది.అధికార పార్టీ వేధింపుల నుంచి తప్పించుకునేందుకు ఇప్పటికే కొంతమంది చంద్రబాబు కి అత్యంత సన్నిహితులైన వ్యక్తులు బీజేపీలో చేరిపోగా మరికొందరు అధికార పార్టీ కి దగ్గరగా వ్యవహరిస్తూ వస్తున్నారు.

ఇక మిగిలి ఉన్న నాయకుల్లో ఆర్థికంగా టీడీపీకి అండదండలు అందిస్తున్న వారు, చంద్రబాబు బినామీ నాయకులుగా పేరుపడ్డవారిపై ఇప్పుడు ఏపీలో వరుసగా ఐటీ, సీఐడీ, ఈడీ మొదలయిన విభాగాల ద్వారా ఆయా నాయకుల ఇళ్లూ, ఆఫీసులపై దాడులు నిర్వహిస్తూ, అనేక కోసుల్లో వారిని దోషులుగా తేల్చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.అయితే ఇందులో కేవలం వైసీపీ ప్రభుత్వం మాత్రమే కాకుండా కేంద్ర అధికార పార్టీ బీజేపీ హస్తం కూడా ఉండడంతో టీడీపీలో మరింత ఆందోళన పెంచుతోంది.

Telugu Ap, Chandrababu, Tdp Struggles, Ysrcp Bjp-Telugu Political News

చంద్రబాబుకు పదేళ్ళపాటు వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన శ్రీనివాస్, లోకేశ్‌ స‌న్నిహితుడు, కుటుంబ వ్యాపార సంస్థ నిర్వాణ హోల్డింగ్స్ డైరెక్టర్‌ కిలారు రాజేష్, వైఎస్సార్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి సంబంధించిన ఆర్కే ఇన్‌ఫ్రా, సబ్‌ కాంట్రాక్టర్‌ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శర్‌త్‌కు చెందిన అవెక్సా ఇన్‌ఫ్రాలలో గత మూడు రోజులుగా సోదాలు నిర్వహిస్తూ అనేక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు సేకరించారు.ఇప్పటికే అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోళ్ళకు సంబంధించి మాజీ మంత్రులు, టీడీపీలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్న నాయకులపై కేసులు నమోదు చేశారు.

ఇక ఇదే తరహాలో మరికొందరు కీలక నాయకులపైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉండడంతో టీడీపీ నాయకులు బెంబేలెత్తిపోతున్నారు.తాజాగా టీడీపీ అధికారంలో ఉండగా అన్నీ తానై వ్యవహరించిన ఇంటిలిజెన్సు చీఫ్ ఏబీ వెంకటేశ్వరావు ను చాలాకాలంగా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా హోల్డ్ లో పెట్టిన వైసీపీ ప్రభుత్వం ఆయనపై అనేక అభియోగాలు నమోదు చేసి ఆయన్ను సస్పెండ్ చేయడంతో అప్పట్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసిన నాయకుల్లో మరింత ఆందోళన పెరిగిపోతోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube