ప్రచారంలో భాగంగా ఓకే వేదిక పై కనపడనున్న షా,నితీశ్

ఢిల్లీ లో ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అన్నీ కూడా తమతమ ప్రచారం లో మునిగిపోయారు.

 Modi Amith Shah Nitish Kumar Campaign-TeluguStop.com

ఈ క్రమంలో జేడీయూ అధినేత,బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా లు తోలిసారిగా ఒకే వేదికను పంచుకోనున్నట్లు తెలుస్తుంది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న జేడీయూ అభ్యర్థి శైలేంద్ర కుమార్‌కు మద్దతుగా వీరు ప్రచారం చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకోనున్నట్లు తెలుస్తుంది.ఫిబ్రవరి 2న నితీష్ కుమార్, అమిత్ షా ఢిల్లీలోని బురాడీ ప్రాంతంలో జరిగే ర్యాలీలో పాల్గొననున్నారు.

సాయంత్రం 4 గంటలకు జరగబోయే బహిరంగ సభలో ఇద్దరూ కలిసి ప్రసంగించనున్నట్లు తెలుస్తుంది.జేడీయూ, బీజేపీ పార్టీలు తమ రాజకీయ వ్యూహంలో భాగంగా ఢిల్లీలోని బీహార్‌వాసులను ఆకట్టుకునేందుకు ఈ సభను ఏర్పాటు చేస్తున్నాయి.

Telugu Amith Shah, Nitish Kumar, Shah Nitish-Telugu Political News

దేశ రాజధాని ఢిల్లీ లో ఎన్నికల నగారా మోగిన దగ్గర నుంచి కూడా బీజేపీ విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టింది.ఆప్ నేతల కార్యక్రమాలలో తప్పులు ఎంచుతూ విస్తృత స్థాయిలో పార్టీ క్యాంపైన్ నిర్వహిస్తుంది.దేశరాజధాని అయిన ఢిల్లీ లో అధికారం చేజిక్కించుకోవడం కోసం బీజేపీ చాలా కాలంగా ఎదురుచూస్తుంది.ఇక ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం తమ వంతు ప్రయ్నతాలు చేస్తున్నారు బీజేపీ నేతలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube