భవిష్యత్తులో మార్కెట్ ని శాసించేది అంతా డిజిటల్ మీడియా అనే విషయం అందరికి తెలిసిందే.చేతిలో స్మార్ట్ ఫోన్, ప్రపంచంలో ఎక్కడ ఎం జరిగన క్షణాల్లో ప్రత్యక్షం చేసే అంతర్జాలం అందుబాటులోకి వచ్చిన తర్వాత డిజిటల్ యుగం మొదలైపోయింది.
ఈ డిజిటల్ యుగంలో ప్రజలు అన్ని అంతర్జాలం ద్వారా స్మార్ట్ ఫోన్ లో లేదంటే ఇంట్లో కూర్చొని టీవీలో చూసుకోవడానికి ఇష్టపడుతున్నారు.ఈ నేపధ్యంలో వెబ్ సిరిస్ లు మొదలయ్యాయి.
ఈ ట్రెండ్ ని ఇప్పటికే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, సోనీ సొంత డిజిటల్ ఓటీటీ ఫ్లాట్ ఫాంతో కోట్లు సంపాదిస్తున్నాయి.కొత్త సినిమాలని వెంటనే కొనేసి థియేటర్ లో 50 రోజులు కూడా పూర్తికాకుండానే డిజిటల్ మీడియాలో ప్రసారం చేస్తున్నాయి.
ఈ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో ఉండే మార్కెట్ టెక్నిక్స్ తెలిసిన అల్లు అరవింద్ ఇప్పుడు ఈ బిజినెస్ లోకి దిగిపోయాడు.టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా, వ్యాపారవేత్తగా ఉన్న అల్లు అరవింద్ డిజిటల్ యుగంలో ప్రజల ఆసక్తిని గ్రహించి ఈ మార్కెట్ లోకి వచ్చేశాడు.
తాజాగా ఇప్పటికే ఉన్న డిజిటల్ చానల్స్ కి పోటీగా ఓ ఓటీటీ యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చాడు.ఆహా పేరుతో ఈ యాప్ ని మార్కెట్ లోకి దించారు.
ఇప్పటికే ఈ డిజిటల్ యాప్ కి బ్యాగ్రౌండ్ వర్క్ ఫినిష్ చేసి ఇందులో మెగా హీరోల సినిమాలని అందుబాటులో ఉంచారు.మెగా ఫ్యామిలీ నుంచి 11 మంది హీరోల వరకు ఉన్నారు.
వీళ్ళ సినిమాలని ఇందులో రిలీజ్ చేసుకున్న మార్కెట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మెగా హీరోల సినిమాలు చూడటానికి వారికి కోట్లాది ఫాన్స్ ఉన్నారు.
ఈ నేపధ్యంలోనే అల్లు అరవింద్ ఇలా తన బిజినెస్ బుర్రతో ఆలోచించి మై హోం రామేశ్వరరావుతో కలిసి ఆహా డిజిటల్ ప్రైమ్ వీడియో యాప్ ని స్టార్ట్ చేశారు.మరి ఇది ఎంత వరకు మార్కెట్ లోకి వెళ్తుంది అనేది చూడాల్సిందే.