పెళ్లి అంటే బాజాలు భజంత్రీలు లేకపోయినా కనీసం వధువు,వరుడు వస్తున్నాడు అంటే ఒక స్పెషల్ మ్యూజిక్ అనేది వస్తుంది.అయితే అలాంటి అన్నిటిని పక్కన పెట్టి, అంబులెన్స్ సైరన్ సౌండ్ తో వధువు,వరుడు పెళ్లి మండపం వద్దకు వచ్చారు.
ఈ ఘటన మలేషియా లో చోటుచేసుకుంది.అయితే వారికీ ఎదో అనారోగ్య సమస్య వల్ల అలా అంబులెన్స్ లో వచ్చారు అని అనుకుంటే పప్పులో కాలేసినట్లే.
అదేమీ లేదు వెరైటీ పెళ్లి కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఆ జంట.వివరాల్లోకి వెళితే….మలేషియా కౌంటాన్ ప్రాంతంలో ఒక జంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న వరుడు, తన పెళ్లి వెరైటీ గా ఉండాలని ఇలా అంబులెన్స్ లో వధువు,వరుడు వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు.
పెళ్లి కూతురు పేషంట్ గా,పెళ్లి కొడుకు డాక్టర్ గా అంబులెన్స్ నుంచి పెళ్లి వేడుక వద్దకు చేరుకున్నారు.అనంతరం కొద్దీ దూరం స్ట్రెచర్ పైనే వధువు ను తీసుకెళ్లిన తరువాత ఆమె స్ట్రెచర్ దిగి డాక్టర్ గెటప్ లో ఉన్న పెళ్లి కొడుకుతో నడుచుకొంటూ వెళ్ళింది.
దీనికి సంబందించిన వీడియో కాస్త సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.ఇక దీనిని చూసిన నెటిజన్లు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు.అయినా వెరైటీ పెళ్లి అంటే మరి ఇలా అంబులెన్స్ లో వెడ్డింగ్ హల్ కు వస్తారా ఎవరైనా అని కొందరు కామెంట్ చేస్తుంటే, మరి కొందరు అయితే వీరి వెరైటీ పెళ్లి పై తెగ విమర్శలు చేస్తున్నారు.పాపం మొత్తానికి వినూత్నంగా పెళ్లి చేసుకోవాలని భావించిన ఈ జంట ప్రయత్నం విమర్శల పాలైంది.