పేటీఎమ్ అని చెప్పారు.. నిండా ముంచారు!

ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ యాప్‌లు చాలా అందుబాటులో ఉండటంతో నగదు లావాదేవీలు సులభతరం అయ్యాయి.కాగా వీటిని వినియోగించుకుని పలు నేరాలకు పాల్పడుతున్నారు సైబర్ మోసగాళ్లు.తాజాగా పేటీఎమ్ పేరుతో ఏకంగా రూ.5 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు.

 Cyber Fraud As Paytm Employees Looted 5 Lakhs-TeluguStop.com

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే, థానెలో ఓ వ్యక్తికి పేటీఎమ్ ఉద్యోగినని ఓ ఫోన్ కాల్ వచ్చింది.పేటీఎమ్‌కు రూ.10 చెల్లించి కేవైసీ అప్‌డేట్ చేయించుకోవాలని, దీని కోసం తాను పంపించే క్విక్ సపోర్ట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సదరు ఉద్యోగి ఫోన్‌లో చెప్పాడు.దీంతో ఆ వ్యక్తి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని తన ఆధార్, ప్యాన్ కార్డు వివరాలు అందులో ఎంటర్ చేశారు.

అంతే, ఇక సైబర్ నేరగాళ్లు తమపనితనం చూపించారు.ఆ వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుండి ఏకంగా రూ.1.2 లక్షలు మాయం చేశారు.దీంతో ఖంగుతిన్ని ఆ వ్యక్తి వెంటనే పోలీసులను ఆశ్రయించారు.అదే సమయంలో మరో 5 మంది కూడా తమ ఖాతాల్లో డబ్బు మాయమైందని తెలపడంతో, మొత్తం 6 మంది ఖాతాల నుంచి ఏకంగా రూ.5.04 లక్షలు మాయం అయినట్లు పోలీసులు గుర్తించారు.దీంతో సైబర్ ఫ్రాడ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube