పేటీఎమ్ అని చెప్పారు.. నిండా ముంచారు!

ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ యాప్‌లు చాలా అందుబాటులో ఉండటంతో నగదు లావాదేవీలు సులభతరం అయ్యాయి.

కాగా వీటిని వినియోగించుకుని పలు నేరాలకు పాల్పడుతున్నారు సైబర్ మోసగాళ్లు.తాజాగా పేటీఎమ్ పేరుతో ఏకంగా రూ.

5 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే, థానెలో ఓ వ్యక్తికి పేటీఎమ్ ఉద్యోగినని ఓ ఫోన్ కాల్ వచ్చింది.

పేటీఎమ్‌కు రూ.10 చెల్లించి కేవైసీ అప్‌డేట్ చేయించుకోవాలని, దీని కోసం తాను పంపించే క్విక్ సపోర్ట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సదరు ఉద్యోగి ఫోన్‌లో చెప్పాడు.

దీంతో ఆ వ్యక్తి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని తన ఆధార్, ప్యాన్ కార్డు వివరాలు అందులో ఎంటర్ చేశారు.

అంతే, ఇక సైబర్ నేరగాళ్లు తమపనితనం చూపించారు.ఆ వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుండి ఏకంగా రూ.

1.2 లక్షలు మాయం చేశారు.

దీంతో ఖంగుతిన్ని ఆ వ్యక్తి వెంటనే పోలీసులను ఆశ్రయించారు.అదే సమయంలో మరో 5 మంది కూడా తమ ఖాతాల్లో డబ్బు మాయమైందని తెలపడంతో, మొత్తం 6 మంది ఖాతాల నుంచి ఏకంగా రూ.

5.04 లక్షలు మాయం అయినట్లు పోలీసులు గుర్తించారు.

దీంతో సైబర్ ఫ్రాడ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.