ప్రెస్ మీట్‌లో చప్పట్లు కొట్టించుకున్న తాప్సీ.. ఎందుకో తెలుసా?

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చాలామంది హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.వారిలో పంజాబీ భామ తాప్సీ కూడా ఒకరు.

 Taapsee Wins Applause For Her Remarks At Iffi-TeluguStop.com

ఝుమ్మందినాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేసింది.తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషల్లో కూడా సినిమాలు చేసి మెప్పించింది.

ఇటీవల కాలంలో తాప్సీ బాలీవుడ్‌లోనే ఎక్కువ సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యింది.

తాజాగా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో తాప్సీ తన కెరీర్ గురించి విలేకరులతో మాట్లాడింది.

ఈ క్రమంలో ఒక వ్యక్తి తాప్సీని ఇంగ్లీషులో కాకుండా హిందీలో మాట్లాడాల్సిందిగా కోరాడు.ఆమె బాలీవుడ్‌లో నటిస్తోందిగా, అందుకే హిందీలో మాట్లాడాలని అతడు అన్నాడు.

దీంతో తాప్సీ అతడికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.తాను తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా నటించానని, తమిళంలో మాట్లాడితే మీకు ఓకేనా అని ఆమె అన్నది.

దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా నవ్వారు.

హిందీలో మాట్లాడాలని అన్న వ్యక్తి నోట మాట రాలేదు.

తాప్సీ ఇచ్చిన సమాధానానికి విలేకరులు అందరూ చప్పట్లు కొట్టారు.ఏదేమైనా వివాదాలకు దూరంగా ఉండే తాప్సీ తనపై కౌంటర్ వేస్తే తిరిగి ఇచ్చే కౌంటర్ కూడా అదే స్థాయిలో ఉంటుందని రుజువు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube