ఉపశమన చర్యలు చేపడుతున్న టిడిపి నేతలు

ఏపీ రాజకీయాలు ఊహించని విధంగా టిడిపి రాజ్యసభ సభ్యులుగా ఉన్న సిఎం రమేష్, సుజనా చౌదరి, టి జి వెంకటేష్ ఉన్నఫలంగా పార్టీ కండువా మార్చేసి బిజేపిలోకి జంప్ అయిపోయారు.ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బిజెపిలో వీరు చేరిక సంచలనంగా మారింది అని చెప్పాలి.

 Tdp Chief Chandrababu Worried About Party Leaders1 1 1 1-TeluguStop.com

టిడిపి రాజ్యసభ సభ్యులుగా ఉన్న వీళ్ళు పార్టీని వీడడంతో ఒక్కసారిగా టిడిపి పార్టీ శ్రేణులలో కూడా టెన్షన్ మొదలైంది.గతంలో లో చంద్రబాబు నాయుడు ఫిరాయింపులు ప్రోత్సహించి వైసిపి పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలను తన పార్టీలోకి చేర్చుకున్నాడు.

ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితంగా ఉన్న రాజ్యసభ సభ్యులు అతనికి ఏకంగా షాకిచ్చి బిజెపిలోకి చేరడం విశేషం.

ఇదిలా ఉంటే ఇప్పుడు టీడీపీ పార్టీ ఆత్మరక్షణలో పడి మరింత మంది నేతలు పార్టీని వీడకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టింది.

ఇందులో భాగంగా ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యనేతలతో మాట్లాడినట్లు తెలుస్తోంది.అమరావతి లోని చంద్రబాబు నివాసానికి టిడిపి అగ్రనేతలు చేరుకొని చర్చిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఈ సమావేశానికి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా హాజరయ్యారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల్లో ఎలా ధైర్యం పాలన విషయాన్ని చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో చర్చిస్తారని తెలిపారు.

రాబోయే స్థానిక సంస్థలు, కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి పార్టీ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయాల మీద అధినేతతో చర్చించనున్నట్లు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube