అరబ్ దేశాల్లో కొన్ని పద్దతులు చాలా విచిత్రంగా ఉంటాయి, అక్కడి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ముస్లీంలు ప్రధానంగా ఉండే ఆ దేశాల్లో జరిగే కొన్ని సంఘటనలు చిత్రంగా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి.
ముస్లీంలు తమ మతాచారాలను అక్కడ నూటికి నూరు శాతం పక్కాగా ఫాలో అవుతారు.దాంతో పాటు అన్ని విధాలుగా చట్టాన్ని అమలు పర్చుతారు.
అక్కడ నేరం చేసేందుకు వణికి పోవాల్సిందే.ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాల్సిందే.
తాజాగా జాగ్రత్తగా మాట్లాడని కారణంగా పెళ్లి పీఠలు ఎక్కాల్సిన వ్యక్తి కాస్త జైలుకు వెళ్లాడు.ఈ సంఘటన అరబ్ దేశాల్లో పరిస్థితిని ప్రపంచానికి తెలియజేస్తుంది.చిన్న తప్పును కూడా పెద్దగా పరిగణించి, పెద్ద శిక్షను వేసే అక్కడ కోర్టులను కొందరు అభినందిస్తుంటే మరి కొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు.ఏది ఏమైనా తాజాగా జరిగిన ఘటన మాత్రం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే… అబుదాబిలో ఒక జంట పెళ్లి కుదిరింది.వారిద్దరికి పెద్దలు నిశ్చయించిన ముహూర్తంకు పెళ్లి జరుగబోతుంది.పెళ్లికి ముందు ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి.పెళ్లి కోసం అతడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.పెళ్లి తేదీ కోసం బంధువులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఆ ఫిక్స్ అవ్వడంతో జంట ఇద్దరు కూడా రోజు చాటింగ్, మీటింగ్ అంటూ ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు.
ఒకరోజు ఛాటింగ్ చేస్తున్న సమయంలో ఆమె ఏదో అన్న మాటకు సరదాగా ఇడియట్ అంటూ మెసేజ్ చేశాడు.ఆ పదానికి హర్ట్ అయిన ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.అతడు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా కూడా ఒప్పుకోలేదు.పోలీసులు ఫిర్యాదు అందుకుని అతడిని అరెస్ట్ చేశారు.ఆమె సాక్ష్యాధారాలు చూపించడంతో వెంటనే అతడికి శిక్ష కూడా కోర్టు వేసింది.
కోర్టు అతడికి ఇండియన్ కరెన్సీ ప్రకారం నాలుగు లక్షల జరిమానాతో పాటు రెండు నెలల సాదారణ జైు శిక్ష కూడా పడినది.
ఇడియట్ అన్నందుకు అంతగా ఆమె ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందో ఏ ఒక్కరు కూడా ఊహించలేక పోతున్నారు.ఆమె ఆ తర్వాత మీడియా ముందుకు రాక పోవడంతో అసలు విషయంపై క్లారిటీ లేదు.
మొత్తానికి అతడికి రెండు నెలల జైలు శిక్ష పడటంతో పెళ్లి క్యాన్సిల్ అయినట్లే అంటున్నారు.