తెలంగాణాలో ముందస్తు ఎన్నికల ప్రభావం ఏమో కానీ బ్రేకింగ్ న్యూస్ లకు కొదవే లేకుండా పోయింది.రకరకాలా అంశాల పేరుతో ఇప్పటికే అనే సర్వే సంస్థలు రంగంలోకి దిగిపోయి తెలంగాణాలో హడావుడి చేస్తూ… తమ సర్వే రిపోర్ట్స్ బయటపెడుతున్నాయి.
ఎన్నికల తరువాత ఫలితం ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని ముందుగానే చెప్పేసి ప్రజలను కన్ఫ్యూజన్ చేసేస్తున్నాయి.ఇవన్నీ ఒక ఎత్తు అయితే.
ఇప్పడు ఇంటలిజెన్స్ విభాగం టీఆర్ఎస్ గెలుచుకోబోయే సీట్ల సంఖ్య ప్రకటించింది.
మొత్తం 119 స్థానాలు ఉన్న తెలంగాణలో అధికారం చేపట్టడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 59.ఆ అంకెను కేసీఆర్ అందుకుంటారని, ఎన్నికల్లో టీఆర్ఎస్ 60 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ రాష్ట్ర ఇంటిలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.ప్రస్తుతానికి కేసీఆర్ ప్రకటించిన 105 మంది అభ్యర్ధుల జాబితా ప్రకారం ఇవి ఖాయమని అంచనా వేశారు.
మిగిలిన 14 స్థానాల్లో అభ్యర్ధుల ఎంపికతో పాటు, ప్రస్తుత జాబితాలోని ఓ 20 మంది వరకూ అభ్యర్ధుల మార్పులు చేర్పులు ఉండవచ్చని ఊహాగానాలు కూడా ఉన్నాయి.బీ ఫామ్ చేతికి అంది, గడువు లోగా నామినేషన్ వేసినంత వరకూ టికెట్ ఖరారు కానట్టేనని, తెలంగాణలోని ఇతర రాజకీయ పార్టీలతో పాటు టీఆర్ఎస్ వర్గాలు కూడా అంటున్నాయి.
కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో మార్పు చేర్పులు జరిగినా 60 సీట్లు మాత్రం పక్కా అని రిపోర్ట్స్ అందుతున్నాయి.టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమిలో పొత్తులు, సీట్ల పంపకాలపై క్లారిటీ కూడా రాలేదు.
ఆ ప్రక్రియ పూర్తయినా వారి మధ్య సఖ్యత ఎంత ఉంటుందనేదే ప్రధాన ప్రశ్న.వీరిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఒకవేళ మేజిక్ ఫిగర్ కి అటూ ఇటుగా సీట్లలో గెలిచినా అధికారం చేపట్టడం అనుమానమే.అందుకే… ఓ వైపు ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే మరోవైపు ఆపరేషన్ ఆకర్షతో 10 నుంచి 15 మంది ని ఫిరాయింపుల ద్వారా చేర్చేసుకుంటే తమకు ఇక ఢోకా ఉండదని టీఆర్ఎస్ భావిస్తోంది.అయితే ఈ ఇంటలిజెన్స్ రిపోర్ట్ పై అందరికి అనేక అనుమానాలు ఉన్నాయి.