లీక్‌ల కారణంగా వాట్సప్‌కు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నారు  

Tollywood Filmmakers Wants To Avoid Whatsapp-

టాలీవుడ్‌కు ప్రస్తుతం అత్యంత ప్రమాధకారిగా మారిన పైరసీ వల్ల నిర్మాతలు కోట్లు నష్టపోతున్నారు.ఒక వైపు పైరసీని అడ్డుకునేందుకు విపరీతంగా కష్టపడుతుంటే మరో వైపు లీక్‌ల బెడద పెద్ద సినిమాలను ఒణికిస్తుంది.

పెద్ద సినిమాలకు సంబందించిన స్టిల్స్‌, వీడియోలో, సాంగ్స్‌ ఇలా అన్ని రకాలుగా లీక్‌ అవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి.గత వారంలోనే అరవింద సమేత మరియు గీత గోవిందంకు సంబంధించిన వీడియోలు లీక్‌ అవ్వడం సంచలనం సృష్టింది.

Tollywood Filmmakers Wants To Avoid Whatsapp-


ముఖ్యంగా గీత గోవిందంకు సంబంధించిన వీడియో లీక్‌ అయ్యి సంచలనం సృష్టించింది.సినిమా మొత్తంను గూగుల్‌ డ్రైవ్‌లో పెట్టారు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది.

ఇలాంటి నేపథ్యంలో ఇతర సినిమాల మేకర్స్‌ కూడా జాగ్రత్త పడుతున్నారు.చిత్ర సెట్స్‌లోకి మొబైల్స్‌ తీసుకు రాకుండా జాగ్రత్త పడటంతో పాటు, షూటింగ్‌ పుటేజ్‌ను జాగ్రత్త చేసేందుకు పెద్ద ఎత్తున కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.


ప్రస్తుతం సోషల్‌ మీడియా చాలా పాపులర్‌ అయ్యింది.అందుకే సోషల్‌ మీడియాలో సినిమాకు సంబంధించిన విశేషాలను షేర్‌ చేసుకోవడంతో పాటు, ఫొటోలు మరియు చిన్న చిన్న వీడియోలను సోషల్‌ మీడియాలో చిత్ర యూనిట్‌ సభ్యులు ఒకరికి ఒకరు షేర్‌ చేసుకోవడం ఈమద్య కామన్‌ అయ్యింది.

అయితే ఇలా వాట్సప్‌లో షేరింగ్‌ వల్ల కూడా ఈ లీక్‌ల బెడద కలుగుతుందని, ఇకపై పెద్ద సినిమాలకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా కూడా వాట్సప్‌ లేదా ఇతర సోషల్‌ మెసేజింగ్‌లో షేర్‌ చేసుకోవద్దు అంటూ నిర్ణయించుకున్నారు.ఈ నిర్ణయం వల్ల కొద్దిలో కాస్త అయినా లీక్‌ల బెడద తప్పించుకోవచ్చు అనేది వారు అభిప్రాయం.

తాజా వార్తలు