అమెరికాలో 100 మంది ఇండియన్స్ అరెస్ట్..

రోజు రోజు కి అమెరికా చేస్తున్న ఆగడాలకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది.సాక్షాత్తు ట్రంప్ సతీమణీ సైతం అక్రమ వలస దారులపై ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అసహనం వ్యక్తం చేసినా సరే ట్రంప్ తీరులో మార్పు కలపడటం లేదు.

 Indians Nri Peoples Over 100 People Apprehended In Us-TeluguStop.com

ఎంతో మందిని అక్రమ వలస దారులుగా గుర్తింఛి చేస్తున్న అరెస్టుల పర్వానికి ఇంకా తెరపడలేదు.గతంలోనే కొన్ని వందల మందిని అక్రమ వలస విధానం పేరుతో నిర్భందించారు అయితే తాజగా మరొక 100 మందిని సైతం ఈ కారణంతో అరెస్ట్ చేయడం మరో మారు అమెరికాలో కలకలం సృష్టించింది.అయితే

బోర్డర్‌ ప్యాట్రోల్‌, ఇమ్మిగ్రేషన్‌ అధికారులు దాదాపు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు.అరెస్టు అయిన వారిలో భారతీయులు కూడా ఉన్నారు.గత అయిదు రోజులుగా హూస్టన్‌లో జరిగిన గాలింపు చర్యల్లో, ఇమ్మిగ్రేషన్‌ అధికారులు 45 మందిని అరెస్టు చేశారు.అయితే అరెస్టు అయిన వారిలో ఎంత మంది భారతీయులు ఉన్నారన్న అంశాన్ని ఏజెన్సీ వారు వెల్లడించక పోవడం గమనార్హం…హోండర్స్‌, ఎల్‌ సాల్వడార్‌, మెక్సికో, గాటేమాల, అర్జెంటీనా, క్యూబా, నైజీరియా, చిలీ, టర్కీతో పాటు భారత దేశస్థులు ఉన్నారని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తెలిపారు.

అయితే డిపోర్ట్‌ అయిన తర్వాత కూడా చాలా మంది అక్రమంగా తమ దేశంలోకి చొరబడ్డారని ఇమ్మిగ్రేషన్ అధికారులు స్పష్టం చేశారు.అయితే అలాంటి వారిపై క్రిమనల్‌ చర్యలు తీసుకోనున్నట్లు అమెరికా బల్లగుద్ది చెప్తోంది టెక్సాస్‌లోని ఓ చెక్‌ పాయింట్‌ వద్ద రిఫ్రిజిరేటర్‌ లాకర్‌లో సుమారు 78 మందిని అదుపు చేశారు.అయితే అరెస్ట్ కాబడిన వారు 100 ఉన్నారా లేక మరింత మంది ఉండే అవకాశం ఉందా వారిలో ఎంతమంది భారతీయులు ఉన్నారు అనే విషయాలని తెలుసుకునే పనిలో ఉన్నారు భారత సంఘాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube