చనిపోయిన వారి ఫేస్‌బుక్ అకౌంట్ ఏమవుతుంది.? వేరే వాళ్ళు ఓపెన్ చేయొచ్చా.?

సమయం, సందర్భం ఏదైనా చేతిలో ఓ స్మార్ట్‌ఫోన్, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు.ఫొటోలు తీయడం, స్టేటస్ అప్‌డేట్లు పెట్టడం, లైక్‌లు కొట్టించుకోవడం ఎక్కువైపోయింది.

 What Happens To Your Facebook Profile When You Die-TeluguStop.com

కొంత మందైతే నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫేస్‌బుక్ ప్రపంచంలో విహరిస్తున్నారు.ప్రస్తుత టెక్ యుగంలో ఫేస్‌బుక్ జనాల్లో అంతగా పాతుకుపోయింది.

ఇదంతా సరే! మనం ఈ భూమిపై జీవించి ఉన్నంత కాలం ఎంచక్కా ఈ సోషల్ మీడియాలో ముందుకు కొనసాగవచ్చు.అయితే మనం చనిపోయాక? అప్పుడు మన ఫేస్‌బుక్ అకౌంట్‌కు ఏమవుతుంది? మాట్లాడుకోవడానికి కొంత ఇబ్బందిగానే ఉండొచ్చు! అయినా దీని గురించి తెలుసుకుంటే తప్పు లేదుగా!

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫేస్‌బుక్ యూజర్లలో మృతి చెందిన వారి అకౌంట్లు దాదాపు 30 మిలియన్ల వరకు ఉన్నాయని, రోజుకు ప్రపంచ వ్యాప్తంగా 8 వేల మంది ఫేస్‌బుక్ యూజర్లు చనిపోతున్నారని సాక్షాత్తూ ఫేస్‌బుక్ సంస్థే తెలియజేసింది.ఈ క్రమంలో అసలు ఒక ఫేస్‌బుక్ యూజర్ చనిపోతే అతని అకౌంట్ ఏమవుతుంది? అనే ఒక సందేహాన్ని పలువురు యూజర్లు ఫేస్‌బుక్ దృష్టికి తీసుకువచ్చారు.దీనికి స్పందించిన ఫేస్‌బుక్ ప్రతినిధులు అలాంటి వారి కోసం ఓ ప్రత్యేక సదుపాయాన్ని కల్పించారు.

అదేమిటంటే లెగసీ కాంటాక్ట్.

ఫేస్‌బుక్‌లో లభ్యమవుతున్న ఈ లెగసీ కాంటాక్ట్ అనే ఫీచర్ ద్వారా యూజర్లు తాము చనిపోయాక తమ అకౌంట్ దానంతట అదే డిలీట్ అవ్వాలా? వద్దా? అనేది ముందుగానే నిర్ణయించుకోవచ్చు.ఒక వేళ అకౌంట్ వద్దనుకుంటే ఆ వ్యక్తి చనిపోయాక ఫేస్‌బుక్‌లో అతనికి ఫ్రెండ్స్‌గా ఉన్న స్నేహితులు, కుటుంబ సభ్యులు ఫేస్‌బుక్‌కు ఓ రిక్వెస్ట్ పంపితే చాలు, ఆ అకౌంట్ డిలీట్ అయిపోతుంది.లేదు, అకౌంట్ కొనసాగాలని అనుకుంటే లెగసీ కాంటాక్ట్‌లో యూజర్ తనకు అత్యంత క్లోజ్‌గా ఉన్న స్నేహితులు, కుటుంబ సభ్యుల్లో ఎవరిదైనా ఒక ఫేస్‌బుక్ ఐడీని ఆ కాంటాక్ట్‌లో ఇవ్వవచ్చు.

దీంతో యూజర్ చనిపోయినప్పుడు లెగసీ కాంటాక్ట్‌లో ఇచ్చిన ఐడీ ప్రకారం సంబంధిత వ్యక్తులు చనిపోయిన వ్యక్తి ఫేస్‌బుక్ అకౌంట్‌ను నిర్వహించవచ్చు.అయితే ఆ అకౌంట్‌లోకి లాగిన్ అయ్యేందుకు మాత్రం అవకాశం ఉండదు.

కాకపోతే ఆ అకౌంట్‌కు చెందిన ప్రొఫైల్ పిక్చర్, స్టేటస్ మెసేజ్ వంటివి మార్చవచ్చు.ఫ్రెండ్స్ రిక్వెస్ట్‌లకు స్పందించవచ్చు.

టైమ్‌లైన్‌లో ఆ యూజ‌ర్‌ను మిస్ అవుతున్నామ‌ని ఏదైనా పోస్ట్ చేయవచ్చు.కానీ లాగిన్ అయ్యేందుకు, పాత పోస్టులు, ఇమేజ్‌లను డిలీట్ చేసేందుకు అవకాశం ఉండదు.

Memorialized-Accounts

అయితే ఎవరైనా వ్యక్తి చనిపోతే అతని ఫేస్‌బుక్ అకౌంట్ ప్రొఫైల్‌లో Remembering అనే మెసేజ్ దర్శనమిస్తుంది.ఇందుకోసం ఆ వ్యక్తికి చెందిన ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ ఫేస్‌బుక్‌కు రిక్వెస్ట్ పంపించాల్సి ఉంటుంది.దాన్ని ఫేస్‌బుక్ ఓకే చేస్తే ఇక ఆ వ్యక్తి ఫేస్‌బుక్ అకౌంట్ Memorialized Timeline గా కనిపిస్తుంది.అనంతరం లెగసీ కాంటాక్ట్‌లో ఇచ్చిన ఐడీ ప్రకారం ముందుకు సాగాల్సి ఉంటుంది.

అది ఇవ్వలేదంటే ఆ వ్యక్తి అకౌంట్ అలాగే ఉండిపోవడమో, డిలీట్ అవడమో జరుగుతుంది.అది కూడా ఇతర ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపితేనే జరుగుతుంది.

ఈ క్రమంలో Memorialized Timeline గా మారిన ఫేస్‌బుక్ యూజర్‌కు చెందిన విషయాలేవీ ఇతరులకు కనిపించవు.ఉదాహరణకు… బర్త్‌డే రిమైండర్లు, పీపుల్ సజెషన్స్ వంటివి.

అయితే ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఆ యూజర్ క్రియేట్ చేసిన పేజీలు కూడా డిలీట్ అవుతాయి.దీంతో ఇవి కూడా ఎవరికీ కనిపించవు.

సో, మీరూ మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో లెగసీ కాంటాక్ట్‌ను యాడ్ చేయాలనుకుంటే ఫేస్‌బుక్‌లోకి వెళ్లి సెట్టింగ్స్ – సెక్యూరిటీ – లెగసీ కాంటాక్ట్ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.అయితే మీకు బాగా దగ్గరి వారినే లెగసీ కాంటాక్ట్ ఐడీలుగా ఇవ్వండి.

లేదంటే ఇతరుల చేతిలోకి మీ సమాచారం వెళ్లే ప్రమాదం ఉంటుంది.మనం ఉన్నా, లేకపోయినా మన సమాచారం మాత్రం విలువైందే కదా!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube