హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్ళిలో మామగారు అల్లుడు కాళ్ళు కడిగి ఆ నీటిని తల మీద జల్లుకొనే ఆచారం ఒకటి ఉంది.ఇలా పెళ్ళిలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి.
ప్రతి ఆచారం వెనక ఎదో ఒక పరమార్ధం ఉంది.పెళ్లి పనులు మొదలు పెట్టటానికి ముందు ఎటువంటి విఘ్నలు రాకుండా వినాయకునికి బియ్యం మూట కట్టి ఆ తర్వాత పనులను మొదలు పెడతారు.
అలాగే పెళ్ళిలో ఆడపడుచుకు కూడా చాలా ప్రాధాన్యం ఉంటుంది.పెళ్లి అయ్యి అత్తారింటికి వెళ్లిన ఆడపిల్ల పుట్టింటికి దూరం కాలేదన్న భావన కలిగించటానికి ఈ ఆచారం పెట్టారు.
ఇక పెళ్ళిలో అల్లుడు కాళ్ళు కడిగే సమయంలో మామగారు ఏమని అనుకుంటారో తెలుసుకుందాం.
ఓ పెండ్లి కుమారుడా పంచ భూతాల సాక్షిగా చిన్ననాటి నుంచి అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన నా కూతురుని ధర్మ, అర్ధ, కామ, మోక్షలకై నీకు అర్పిస్తున్నాను.
దానం ఇస్తున్నాను.ఈ దానం వల్ల నాకు బ్రహ్మ లోక ప్రాప్తి కలగాలని అడుగుతున్నాను.
ఓ పెండ్లి కుమారుడా నీవు ఈ సమయాన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివే… నా బిడ్డ లక్ష్మి దేవి.అంతటా నీకు కాళ్ళు కడుగుతున్నానని చెప్పి వరుడి కాళ్ళు కడుగుతాడు వధువు తండ్రి.
వారిని లక్ష్మి నారాయణులుగా భావించి పెళ్ళికి వచ్చిన వారందరు వారి మీద అక్షింతలు వేసి నమస్కారం చేస్తారు.