కేసీఆర్ మొదటి నుంచీ మూటగట్టుకున్న అపవాదు ఒక్కటే ఒక్కటి ఉంది అదే ప్రతిపక్షాలకి బ్రహ్మాస్త్రం గా పనికొస్తోంది.అదేంటంటే కుటుంభ పాలన.
తన పార్టీలో బయటి వాకంటే ఎక్కువగా తన కుటుంభంలోని వారికే ఎక్కువగా టిక్కెట్లు ఇచ్చారని అయితే వారే ఇప్పుడు తెలంగాణా మొత్తాని శాసిస్తున్నారని టాక్ బాగా వినిపిస్తోంది.ఇదిలాఉంటే ఇదిలాఉంటే నిన్నా మొన్నటి వరకూ టీఆర్ఎస్ లో ఆనలుగురు కీలకం అంటూ కొన్ని వ్యాఖ్యలు వినిపించాయి.
ఆ నలుగురిలో ఒకరు కేసీఆర్ తన వారసుడు కేటిఆర్, మరొకరు మేనల్లుడు హరీష రావు, కవిత.వీరు నలుగురు తెలంగానని శాసిస్తున్నారు అంటూ ఎన్నో ఆరోపణలు వచ్చాయి.
అయితే ఇప్పుడు వారికి తోడుగా మరొక వ్యక్తీ వచ్చాడని టాక్ వినిపిస్తోంది.పార్టీలో ప్రభుత్వంలో వీళ్ళదే రాజ్యం వీళ్ళకి తప్ప మిగిలిన వారికి స్థానం ఉండదు.
ఇంతకీ ఆ ఐదో వ్యక్తి ఎవరంటే.
పార్టీలో సీనియర్ నాయకులు ఎంతమంది ఉన్నా సరే ఈ ఐదుగురు కి తప్ప మరో వ్యక్తికీ అక్కడ స్థానం ఉండదు.
తలసాని లాంటి సీనియర్ నాయకులు సైతం కేసీఆర్ కోసం పడిగాపులు కాయల్సిందే.ఇంతకీ ఆ ఐదో వ్యక్తి ఎవరో కాదు కేసీఆర్ భందువు అయిన జోగిన పల్లి సంతోష్ కుమార్ ఇప్పుడు ఈయన రాజ్యసభ సభ్యడు కూడా కానున్నారు.
అయితే సంతోష్ కుమార్ కోసం ఎంతో వ్యూహాత్మకంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు.రాజ్యసభ ని కట్టపెట్టడం కోసం ముందుగానే పార్టీ ప్రధాన కార్యదర్శి గా పార్టీలోకి తీసుకున్నారు.
అయితే ఇక్కడి నుంచే కేసీఆర్ పై సొంత పార్టీ నేతలకి అసహనం వ్యక్తం అవుతోందని టాక్.
ఇప్పుడు పార్టీలో ఎవరు కేసీఆర్ ని కలవాలని అనుకున్నా సరే ముందుగా సంతోష్ కుమార్ ని ప్రసన్నం చేసుకోవాల్సిందే.
అయితే కేసీఆర్ కుటుంభ సభ్యులు మినహాయిస్తే కేసీఆర్ ని నేరుగా కలవగలిగే వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు.ఈయనకి మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఉంది.
అయితే నిన్నా మొన్నటి వరకూ టీఆర్ఎస్ లో చక్రం తిప్పిన ఆనలుగురు కాస్తా ఇప్పుదు ఐదుగురు అయ్యారని.సామాన్యులు మాత్రమే కాదు.
మంత్రులు సైతం కేసీఆర్ ని కలవాలంటే ఆ ఐదో వ్యక్తి అనుమతి తప్పనిసరి అవుతోందని ఎంతో నిరాశతో పార్టీలో కొందరు నేతలకి చెప్పుకుని భాదపడుతున్నారట ఎమ్మెల్యేలు మంత్రులు.
.