రానున్నది వలసల కాలం.అప్పటి వరకూ ఉన్న పార్టీ ని వదిలేసి.
కొత్త పార్టీల వైపు మళ్ళి పోయే కాలం వచ్చేస్తోంది.ముందుగానే అందరు నేతలు పార్టీలపై అంచనాలు వేసుకుని మరీ జంప్ అయ్యిపోతున్నారు అని టాక్.
అయితే ఈ సమయంలో కొత్త పార్టీ అయిన జనసేనలోకి కూడా వలసలు భారీ స్థాయిలో ఉండబోతున్నాయి అని తెలుస్తోంది.పలువురు సీనియర్ నేతలు ఆదిసగా ప్రిపైర్ అవుతున్నారని టాక్.
ఇటు టీడీపీలోకి .అటు వైసీపీలోకి వెళ్ళడానికి ఇష్టం లేని కొందరు నేతలు… జనసేన వైపు చూస్తున్నారని తెలుస్తోంది.ఈ లిస్టులో ముందుగా తిరుపతి మాజీ ఎంపీ, సౌమ్యుడు, అయిన చింతా మోహన్ ఉన్నారట.అయితే తాజా రాజకీయ సమీకరణాలు దగ్గరగా పరిశీలిస్తున్న ఆయన ఇప్పుడు పార్టీ మారడానికి సిద్దంగా ఉన్నారని టాక్.
అయితే ఎంతో అనుభవం ఉన్న చింతా జనసేన లోకి వెళ్ళడం అనేది ఆ పార్టీకి కలిసొచ్చే అంశమే అని చెప్పాలి.
చిత్తూరు రాజకీయాలలో చింతా మోహన్ ఎంతో అనుభవం గల నాయకుడు.
పలు పర్యాయాలు ఎంపీగా కూడా సేవ చేశారు.రాష్ట్ర విభజనతో ఆయన అంత యాక్టివ్‌గా లేరు.2019లో మరోసారి తిరుపతి నుంచి పోటీ చేయాలని భావిస్తోన్న ఆయన.ఈ మధ్య చేస్తున్న వ్యాఖ్యలు జనసేన వైపు చూస్తున్నట్టుగా అర్థం అవుతున్నాయి.
రాబోయే ఎన్నికలలో ఏపీని అభివృద్ధి చేయడానికి డైనమిక్ లీడర్ ఉండాలని ,అతనికి క్లీన్ ఇమేజ్ ఉండాలని ఆయన చేసే వ్యాఖ్యలు చుస్తే అది పవన్ కోసమే అని వేరేగా చేపవలసిన అవసరం లేదు.
అయితే క్లీన్ ఇమేజ్ ఉన్న నేత రాష్ట్రంలో ఎవరా అని అనుకుంటే కొత్తగా వచ్చిన పవన్ కళ్యాణ్ మాత్రమే కనిపిస్తున్నారు.
మిగిలిన నేతలకు ఎదో ఒక మచ్చ ఉండనే ఉంది సో చింతా పార్టీ మారాలని అనుకునేది జనసేనలోకి వెళ్ళడానికే అని డిసైడ్ అవుతున్నారు మిగిలిన నేతలు .టీడీపీ-జనసేన కనుకా రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తే తిరుపతి టికెట్ కష్టమే.అదే పొత్తు లేకపోతే మాత్రం జనసేన నుంచి తిరుపతి ఎంపీ టికెట్‌ని ఈజీగా దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నారట…అయితే ఇక్కడ చింతా కి ఒక ప్రశ్న కూడా వేస్తున్నారు నెటిజన్లు చింతా క్లీన్ ఇమేజ్ కావాలి అంటున్నాడు మరి చంద్రబాబు తో దోస్తీ కడుతున్న పవన్ కి క్లీన్ ఇమేజ్ ఉన్నట్టా.భాహుభార్యాల విషయంలో ఇప్పటి వరకూ క్లారిటీ లేని పవన్ కి చింతా ఎలా క్లారిటీ ఇస్తారు అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
అయితే చింతా తనంతట తానుగా ఏ పార్టీలోకి వెళ్తారో చెప్పే వరకూ చాలా మంది సైలెంట్ గా ఉన్నారు అనేది మాత్రం వాస్తవం.
.