వారం ముందే కోటి కలెక్ట్ చేస్తున్న బ్రహ్మోత్సవం

మహేష్ బాబు బ్రహ్మోత్సవం వారంరోజుల ముందే రికార్డుల వేట మొదలుపెట్టింది.ఇంకా సెన్సార్ పూర్తవలేదు, తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్ కూడా మొదలవలేదు, కాని బ్రహ్మోత్సవం కలెక్షన్లు మాత్రం మొదలయ్యాయి.

 Brahmotsavam Nizam Benefit Shows To Collect 1cr-TeluguStop.com

నైజాం హక్కులను సొంతం చేసుకున్న అభిషేక్ పిక్చర్స్ శ్రీమంతుడుకి చేసినట్టుగానే మళ్ళీ నైజాంలో మంచి ప్లానింగ్ తో దూసుకుపోతోంది.

భారి అంచనాల మధ్య సెలవురోజు విడుదలైన సర్దార్ గబ్బర్ సింగ్ మొదటిరోజు శ్రీమంతుడు నైజాం కలెక్షన్లను దాటలేదంటే, మీరే అర్థం చేసుకోండి, అభిషేక్ పిక్చర్స్ ప్లానింగ్ ఎంత సమర్థవంతమైనదో.

ఇప్పుడు బ్రహ్మోత్సవం నైజాం బెనిఫిట్ షోలు శ్రీమంతుడుకి మించి ఉండబోతున్నాయి.

నైజాంలో ఇప్పటివరకు కన్ఫర్మ్ అయిన బెనిఫిట్ షోస్ నుంచి కోటి రూపాయలు కొల్లగొట్టనుంది బ్రహ్మోత్సవం.

ఈ లెక్కన నైజాం తొలిరోజు మళ్ళీ రికార్డుల మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది.అయితే, పోలీసు పర్మిషన్ ఎన్ని బెనిఫిట్ షోలకు దొరుకుతుందో, ఎన్ని షోలకి క్యాన్సిల్ అవుతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.

కాబట్టి ప్రస్తుతం బయ్యర్లు వేస్తున్న అంచనా అటు ఇటుగా మారొచ్చు.

అన్ని అనుకున్నట్లుగా, ప్లాన్ ప్రకారమే జరిగితే మాత్రం, నైజాంలో శ్రీమంతుడు తొలిరోజు రికార్డులను ( బాహుబలి మినహాయించి ) అవలీలగా దాటేస్తుంది బ్రహ్మోత్సవం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube