యూకేలో భారత సంతతి బాలుడి పెద్ద మనసు: ఫండ్ రైజింగ్‌తో ఆసుపత్రికి ఇంక్యుబేటర్

యూకేలో ఓ ఆరేళ్ల భారత సంతతి బాలుడు తన పెద్ద మనసు చాటుకున్నాడు.ఫండ్ రైజింగ్ ద్వారా తాను జన్మించిన ఆసుపత్రికి కొత్త ఇంక్యుబేటర్ విరాళంగా ఇచ్చాడు.

 6 Year Old Indian Origin Boy Raises £21k To Donate Incubator To Uk Hospital, 6-TeluguStop.com

సర్రేలో నివసిస్తున్న ధిల్లాన్ మంకూ అనే ఆరేళ్ల చిన్నారి కుటుంబం భారత్‌లోని పంజాబ్ నుంచి యూకేకి వలస వచ్చింది.ఈ నేపథ్యంలో ఓ రోజున ధిల్లాన్ తల్లి షార్న్ అతను పుట్టినప్పుడు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్య గురించి చెప్పింది.

దీంతో ఆ చిన్నారి ‘‘ అమ్మా.? నెలలు నిండకుండా పుట్టే పిల్లలను రక్షించే ఇంక్యుబేటర్ మనం కొనగొలమా.? అని అడిగాడు.

కట్ చేస్తే 18 నెలల తర్వాత తన లక్ష్యమైన ఇంక్యుబేటర్‌ కోసం 21,000 పౌండ్లను సేకరించి, సర్రేలోని కింగ్స్‌టన్ హాస్పిటల్‌‌లోని నియోనాటల్ యూనిట్‌క‌ు అందజేశాడు.

ఇందుకోసం ధిల్లాన్ మంకూ ఎంతో కష్టపడ్డాడు.తన పిగ్గీ బ్యాంకులో డబ్బులు దాయడం ప్రారంభించిన మంకూకి పిగ్గీ బ్యాంక్ నిండటంతో ఓ రోజున అతని తల్లిదండ్రులు బ్యాంకుకు తీసుకెళ్లారు.

అక్కడి అధికారులు 1,500 పౌండ్ల విలువ చేసే నాణేలను బాలుడికి చూపించారు.

Telugu Donate Uk, Covid, Dhillan Manku, India, Kingston, Lock, Sharn-Telugu NRI

ఈ నేపథ్యంలో యూకేలో కోవిడ్ 19 కారణంగా లాక్‌డౌన్ విధించినప్పటికీ ధిల్లాన్ తన లక్ష్యాన్ని మరిచిపోలేదు.నిధుల సేకరణ కోసం అతను కాఫీ మార్నింగ్, ట్రాంపోలిన్ బౌన్స్, గోల్ఫ్ డే, బర్త్ డే స్విమ్, స్పాన్సర్డ్ రన్‌‌తో పాటు జస్ట్‌గివింగ్ పేజ్ నుంచి సుమారు 16,000 పౌండ్లను వసూలు చేశాడు.అయితే లాక్‌డౌన్‌ను యూకే ప్రభుత్వం మరింత కాలం పొడిగించడంతో ధిల్లాన్‌కు మిగిలిన 5,000 పౌండ్ల సేకరణ కష్టంగా మారింది.

దీంతో ఆ బాలుడికి ఓ ఉపాయం తట్టింది.బాల బాలికల కోసం అందమైన ఆకృతులను తయారు చేసి అమ్మాలని నిర్ణయించుకున్నాడు.దీనిలో భాగంగా రెండు పోస్టర్లను తయారు చేసి తన ఉద్దేశ్యాన్ని తెలిపాడు.చిన్నారి ఆలోచనను మెచ్చిన యూకేలోని అగశ్రేణి వస్త్ర వ్యాపార సంస్థ ‘‘ PrettyLittleThing and Boohoo’’ వ్యవస్థాపకులైన కమానీ కుటుంబ సభ్యులు.

ధిల్లాన్‌కు అవసరమైన 5,000 పౌండ్లు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

Telugu Donate Uk, Covid, Dhillan Manku, India, Kingston, Lock, Sharn-Telugu NRI

వీరందరి మద్ధతుతో మంకూ తన కలను నేరవేర్చుకున్నాడు.గత గురువారం కింగ్స్‌టన్ ఆసుపత్రికి ఇంక్యుబేటర్‌ను అందజేశాడు.ఈ సందర్భంగా తనకు చాలా సంతోషంగా ఉందని.

చిన్నారుల కోసం ఇలా చేయాలని అనిపించిందని చెప్పాడు.తాను డాక్టర్ అయిన తర్వాత పిల్లలను బాగా చూసుకుంటానని ధిల్లాన్ చెప్పాడు.

ఆరేళ్ల చిరుప్రాయంలో ఈ బాబు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube