ఆ దర్శకుడిని మహేష్ రెండు సార్లు కాదన్నాడు

ఏఆర్ మురుగదాస్ డేట్స్ కోసం ఎన్నిరోజులైనా ఎదురుచూసే హీరోలు చాలామందే ఉన్నారు.మురుగదాస్ సినిమా అంటే ఎవరికీ ఇష్టం ఉండదు, మురుగదాస్ దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలని ఎవరికీ ఉండదు.

 Mahesh – Murugadoss Combination Failed Two Times-TeluguStop.com

మరి ఆ దర్శకుడిని ఒకసారి కాదు రెండు సార్లు మహేష్ కాదాన్నాడు అంటే నమ్ముతారా.నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం.

దశాబ్దకాలంగా వీరిద్దరి కాంబినేషన్ వాయిదా పడుతూనే వస్తోంది.మొదటగా తమిళ గజినీ పూర్తవగానే మహేష్ దగ్గరికి వెళ్ళాడు మురుగదాస్.సినిమా అప్పటికి విడుదల కాలేదు.తెలుగులో మహేష్ తో రీమేక్ చేయాలనేది మహేష్ ఉద్దేశ్యం.

కాని రీమేక్ చేయాడాన్ని అస్సలు ఇష్టపడని సూపర్ స్టార్, సున్నితంగా తిరస్కరించాడు.సినిమా ఖచ్చింతంగా బ్లాక్ బస్టర్ అవుతుందని, కొత్త కథతో మనమిద్దరం చేద్దాం అని మహేష్ మాట ఇవ్వడంతో గజినీ తరువాత మెగాస్టార్ చిరంజీవితో స్టాలిన్ మొదలుపెట్టాడు మురుగదాస్.

ఇక తుపాకి కథ మొదట మహేష్ కే చెప్పాడంట మురుగదాస్.కాని మహేష్ అప్పటికే తనకున్న ఒప్పందాల వల్ల డేట్స్ ఇవ్వలేకపోయాడు.ఆ రకంగా ఆ సినిమా విజయ్ కి వెళ్ళిపోయింది.ఇక మళ్ళి ఇన్ని సంవత్సరాల తరువాత మురుగదాస్ మరో కథ చెప్పడం, మహేష్ సరే అనేయడం, అంతా చకచక జరిగిపోయాయి.

మొత్తానికి మురుగదాస్ 11 ఏళ్ల నిరీక్షణ ఫలించింది.ఏప్రిల్ లో మొదలవబోయే మహేష్ – మురుగదాస్ సినిమా విడుదల అయ్యాక ఎన్ని సంచలనాలు సృష్టిస్తుం

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube