Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

బిగ్ బాస్ లో పెద్ద మోసం ... దొరికేసారు -Big Fake In Telugu Big Boss Exposed

సంచలనాత్మక షో బిగ్ బాస్ రికార్డు తీఆర్పితో దూసుకుపోతోంది. మొదటి ఎపిసోడ్ కి రికార్డు టీఆర్పి రాబట్టిన ఈ రియాలిటి షో, రెండోవవారం మరింత పెరిగిన టీఆర్పితో జనాలకి ఆకట్టుకుంది. అయితే ఈ రియాలిటి షోలో జరుగుతున్నది అంతా రియాలిటి కాదేమో. పెద్ద పెద్ద రూల్స్ చెబుతారు కాని, అందులో కొన్నిటికీ సడలింపులు ఉన్నట్లు ఉంది. బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఇంట్లో ఉన్న వారు ఫోన్ వాడరాదు. అది ఒకే, ఇంతవరకు ఎవరిదగ్గర ఫోన్ చూడలేదు. మధ్యమధ్యలో సేల్ఫీ తీసుకుంటున్న ఫోన్లు ఎలాగో టాస్క్ లో భాగం. టీవి లేదు, బయటి వ్యక్తితో కనెక్షన్ లేదు. వంట వాళ్ళే వండుకోవాలి. బాత్ రూమ్స్ వారే శుభ్రం చేసుకోవాలి, అలాగే ఎవరి బట్టలు వారే ఉతుక్కోవాలి. మరి బాత్ రూమ్స్ నిజంగానే శుభ్రం చేసుకుంటున్నారా లేదో తెలియదు కాని బట్టలు మాత్రం వాళ్ళే ఉతుక్కోవట్లేదు ఏమో.

అదేంటి .. జ్యోతి వెళుతూ వెళుతూ ప్రిన్స్ మీద బిగ్ బాంబ్ వేసిందిగా, దాంతో ప్రిన్స్ ఇంట్లో ఉన్న అందరి బట్టలు తానే ఉతకాల్సి వచ్చిందిగా అని అడుగుతున్నారా ? ప్రిన్స్ బట్టలు ఉతుకుతుండగా ఒకేఒకసారి చూసాం మనం. తను పనిష్ మెంట్ సమయంలో అందరి బట్టలు ఉతికే ఫుటేజ్ ఎలాగో మన దగ్గర లేదు. అలాగే మిగితావారు బట్టలు ఉతుక్కోవడం కూడా మనం చూడలేదు.

Continue Reading
More Posts
To Top