మిలియనీర్‌తో అసిన్‌ పెళ్లి

తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించిన మ్లూ బ్యూటీ అసిన్‌ త్వరలో పెళ్లికి సిద్దం అవుతోంది.ప్రస్తుతం బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా దూసుకు పోతున్న ఈమెకు భారత దేశపు దిగ్గజ మొబైల్‌ కంపెనీ మైక్రోమ్యాక్స్‌ అధినేత రాహుల్‌ శర్మతో వివాహం జరుగనుంది.

 Asin Gets Her Real Life ‘sanjay Ramaswamy’-TeluguStop.com

వీరిద్దరు గత నాలుగు సంవత్సరాలుగా డేటింగ్‌లో ఉన్నట్లుగా మీడియాలో అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి.అయితే వాటికి అధికారిక క్లారిఫికేషన్‌ మాత్రం రాలేదు.

తాజాగా అందుతున్న సమాచారం అసిన్‌కు రాహుల్‌ శర్మతో వివాహం కన్ఫర్మ్‌ అయినట్లుగా సమాచారం అందుతోంది.

బాలీవుడ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా వరుసగా విజయాలతో దూసుకు పోతున్న అసిన్‌ త్వరలో ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి, చాలా రోజులు అయినా ఇప్పటి వరకు అసిన్‌ మరో సినిమాకు ఓకే చెప్పింది లేదు.దాంతో అమ్మడు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

పెళ్లి తర్వాత ఈమె సినిమాలకు పూర్తిగా గుడ్‌ బై చెప్పే అవకాశాలున్నాయి.అసిన్‌, రాహుల్‌ శర్మల పెళ్లి విషయంపై అతి త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube