మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్‌లో దసరా కానుకగా విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించారు.
ఇక ఈ సినిమాకు టైటిల్‌ను చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించింది లేదు.సినిమా ఆరంభ సమయంలో ‘నా పేరే రాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత ‘బ్రూస్‌లీ’, ‘విజేత’ టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి.తాజాగా చిరంజీవి పుట్టిన రోజున చరణ్ మూవీ టైటిల్‌ను ప్రకటించబోతున్నట్లుగా మెగా సన్నిహితులు ప్రకటించారు.
అయితే అంతకు ముందే చరణ్ మూవీ టైటిల్ లీక్ అయ్యింది.
చిరంజీవి సూపర్ హిట్ మూవీ ‘విజేత’ టైటిల్‌నే రామ్‌చరణ్ మూవీకి పెట్టాలని దర్శకుడు శ్రీనువైట్ల భావిస్తున్నాడని, అందుకు చరణ్ మరియు చిరంజీవిలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
‘విజేత’ టైటిల్‌ను ఈనె 22న అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని కూడా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.సెంటిమెంట్‌గా ‘విజేత’ టైటిల్ తప్పకుండా కలిసి వస్తుందని మెగా ఫ్యామిలీ సన్నిహితులు చెబుతున్నారు.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌చరణ్ ఫైట్ మాస్టర్‌గా కనిపించనున్నాడు.ఈ సినిమాలో ఒక లక్ష్యం దిశగా చరణ్ ప్రయాణం ఉంటుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.







