'గడప గడపకు' నిలదీతలు ? వైసీపీకి ఎన్ని ఇబ్బందులో ?

ఏపీలో జగన్ పాలన జనరంజకంగా ఉంది.పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు భారీ ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేశారు.

 Ysrcp Troubled On Gadapa Gadapaku Ysrcp Program Details, Jagan, Ysrcp, Ap, Tdp,-TeluguStop.com

కరోనా మహమ్మారి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసినా,  జగన్ మాత్రం ప్రజలకు ఎక్కడ ఎటువంటి లోటు పాట్లు లేకుండా సంక్షేమ పథకాలకు ఎక్కడా  బ్రేక్ లేకుండా అమలు చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు.జనం కోసం ఇంతగా తపనపడే ముఖ్యమంత్రి ఇంకెవరు ఉండరని, 2024 ఎన్నికల్లోనే కాకుండా .ఆ తరువాత వచ్చే ఎన్నికల్లోనూ జగన్ విజయం సాధిస్తారని , వైసీపీ ప్రభుత్వమే మళ్లీ ఏపీలో కొలువు తీరుతుందని ఆ పార్టీ నాయకులు పదే పదే చెబుతున్నారు.
  జగన్ కూడా ఇదే విశ్వాసంతో ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ పథకాల పనితీరుపై ప్రజల్లో ఏ విధమైన అభిప్రాయం ఉంది ? ప్రజలు తన పాలన గురించి ఏమనుకుంటున్నారు ఇలా అనేక అంశాలను తెలుసుకునేందుకు ముందుగా గడపగడపకు వైసిపి కార్యక్రమాన్ని రూపొందించారు.తరువాత దానిని ‘ గడపగడపకు మన ప్రభుత్వం ‘ గా మార్చారు.

నిన్న రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం మొదలైంది.ఈ సందర్భంగా గ్రామాల్లో పర్యటించిన నాయకులకు ప్రజల నుంచి ఊహించని ఈ విధంగా రెస్పాన్స్ వచ్చింది.

కొన్నిచోట్ల ప్రజలు తమ సమస్యలను ప్రస్తావించగా,  చాలాచోట్ల స్థానిక వైసీపీ నాయకులను, అధికారులను నిలదీసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.జగన్ చిత్తశుద్ధితో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న స్థానిక వైసిపి నాయకులు జగన్ ఆశయాలకు, నిర్ణయాలకు విరుద్ధంగా అవినీతి కార్యక్రమాలకు పాల్పడడం, వంటి వ్యవహారాలపై ప్రజలు నిలదీస్తున్న  వ్యవహారాలు ఇబ్బందికరంగా మారాయి.
 

Telugu Ap Cm Jagan, Ap, Cmjagan, Gadapagadapaku, Jagan, Ysrcp, Ysrcp Troubled-Po

కర్నూలు జిల్లా నంద్యాలలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పర్యటించారు.ఈ సందర్భంగా బేతంచెర్ల మండలం హెచ్ కొట్టాల లో బుగ్గన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఉపాధి హామీ డబ్బులు రావడంలేదని ఆయనను కొంతమంది నిలదీశారు.ఈ సందర్భంగా ఆయన వారికి సర్ది చెబుతూనే.

ఈ డబ్బులు విషయం పై అధికారులను ప్రశ్నించారు.వారం రోజుల్లోగా డబ్బులు వస్తాయని వారికి హామీ ఇచ్చారు.

ఇక చాలా చోట్ల అనేక సమస్యలపై జనాలు ఎమ్మెల్యేలు మంత్రులు నిలదీసిన ఘటనలు చోటుచేసుకున్నాయి.ఇంకొన్ని చోట్ల సొంత పార్టీ నాయకులే ఎమ్మెల్యే లు, మంత్రులను నిలదీస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube