ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.విషయంలోకి వెళ్తే భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని( Rahul Gandhi ) అస్సాంలో అడ్డుకోవడంతో పాటు ఆయనపై కొంతమంది దాడులకు కూడా పాల్పడటం జరిగింది.
ఈ దాడులను నిరసిస్తూ బీజేపీ పార్టీపై వైయస్ షర్మిల సీరియస్ అయ్యారు.బీజేపీ గుండాలు గుంపులు గుంపులుగా వచ్చి రాహుల్ గాంధీ చేస్తున్న యాత్రలో పాల్గొన్న వారిపై దాడి చేయడం జరిగింది.
రాహుల్ గాంధీకి ప్రమాదం తలపెట్టే ప్రయత్నం చేశారు.శాంతీయుత యాత్రను బీజేపీ( BJP ) అడ్డుకోవడం.ప్రజాస్వామ్యమేనా అని ప్రశ్నించారు.జనవరి ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా షర్మిల ఈనెల 21న ఏపీ పీసీసీ చీఫ్( AP PCC Chief ) బాధ్యతలు స్వీకరించడం జరిగింది.
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు చేపట్టాక వైసీపీ, తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడటం జరిగింది.ఇదే సమయంలో రాష్ట్రములో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు.
ఈ క్రమంలో మంగళవారం నుంచి జిల్లాల పర్యటనకు షర్మిల శ్రీకారం చుట్టడం జరిగింది.ముందుగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి వైయస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయ( Idupulapaya ) వరకు పర్యటించడానికి రెడీ అయ్యారు.ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా వైయస్ షర్మిల కార్యచరణ చేపడుతున్నారు.ఈ క్రమంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రనీ( Bharat Jodo Nyay Yatra ) అస్సాంలో బీజేపీ పార్టీ నేతలు అడ్డుకోవడంతో వైయస్ షర్మిల విశాఖపట్నంలో.
జీవీఎంసీ వర్ధన్ నిరసన చేపట్టడం జరిగింది.