యూట్యూబ్ కి ఏమైంది..?! వీడియోలు కనిపించట్లేదు..!

ప్రపంచవ్యాప్తంగా వీడియో కంటెంట్ అందించే ఫ్లాట్ ఫామ్ యూట్యూబ్.గూగుల్ సంస్థకు చెందిన ఈ యూట్యూబ్ ఆన్లైన్ వీడియో ఆధారిత సేవలను అందిస్తోంది.

 Youtube Down Ite Experienced Technical Outage In Playing Videos,-TeluguStop.com

అయితే తాజాగా యూట్యూబ్ సేవలకు సంబంధించి కొన్ని అవరోధాలు కలిగాయి.కొద్ది గంటల నుండి యూట్యూబ్ లో ఆన్లైన్ లో వీడియోలు చూడటానికి కొన్ని సాంకేతిక సమస్యలు ఏర్పడినట్లుగా కనపడుతుంది.

దీంతో యూ ట్యూబ్ యూజర్లు కాస్త గందరగోళానికి గురయ్యారు.ఇకపోతే తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇలాంటి సంఘటన ఏదైనా జరిగి ఉండవచ్చని భావించారు.

ఇందులో భాగంగానే కొందరు వారికి సంబందించిన ఛానల్ లో మాత్రమే ఆగిపోయినట్లుగా అనుకున్న మిగతా యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి చూడగా అవి కూడా ప్లే కాకపోవడంతో పూర్తిగా సాంకేతిక సమస్య కారణమని వారు నిర్ణయించుకున్నారు.ఈ సమస్య ప్రపంచంలో కేవలం భారతదేశం మాత్రమే కాకుండా జపాన్, ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో కూడా అయినట్లు తెలుస్తోంది.

యూట్యూబ్ లో కేవలం వీడియోలు ప్లే కాకపోవడమే కాకుండా ఏలాంటి వీడియోస్ అప్లోడ్ కూడా తీసుకోవట్లేదు.ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో నెటిజన్స్ వారి ఆందోళనలను వ్యక్తపరుస్తున్నారు.

Telugu India, Japan, Netizens, Upload, Youtube-Latest News - Telugu

యూట్యూబ్ లో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో వారికి సంబంధించిన బృందాలు యూట్యూబ్ యూజర్స్ కి కలిగిన అంతరాయాన్ని నిర్మూలించేందుకు తాము అన్ని ప్రయత్నాలు త్వరితగతిన చేస్తున్నట్లు తెలిపాయి.ఇందుకు సంబంధించి ఎటువంటి సమస్య వచ్చిందో మాత్రం బయటకు వెల్లడించలేదు.సమస్య ఎటువంటిదైనా సరే వీలైనంత త్వరగా ఈ సమస్య పూర్తి అవ్వాలని యూజర్లు కోరుతున్నారు.చూడాలి మరి ఈ టెక్నికల్ సమస్య ఎంత త్వరగా పూర్తి అయి యూట్యూబ్ యూజర్లకు వారి సర్వీసులను అందజేయగలరో.

ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ లో ఒక్క రోజుకు కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అవుతుండటం, అలాగే కొన్ని కోట్ల లో వీడియోలను చూస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాము.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube