సాధారణంగా ఒక సినిమా రిజల్ట్ ప్రభావం ఆ సినిమా హీరోపై, డైరెక్టర్ పై ఎక్కువగా పడుతుంది.సినిమా సక్సెస్ సాధిస్తే హీరోలు ఎంత సంతోషంగా ఫీలవుతారో సినిమ ఫ్లాప్ అయితే అంతే బాధ పడతారు.
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైతే ప్రపంచవ్యాప్తంగా తమకు గుర్తింపు దక్కుతుందని ఎన్టీఆర్, చరణ్ ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ చాలాసార్లు మారడంతో ఎన్టీఆర్, చరణ్ డిప్రెషన్ కు గురవుతున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్ కాగా సంక్రాంతి కానుకగా ఈ నెల 7వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా తప్పనిసరి పరిస్థితుల్లో నిర్మాతలు వాయిదా వేయాల్సి వచ్చింది.20 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రమోషన్స్ చేసిన తర్వాత సినిమా రిలీజ్ ను వాయిదా వేయడంతో ఎన్టీఆర్, చరణ్ అభిమానులు ఫీలయ్యారు.ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్, చరణ్ డిసెంబర్ 31 వరకు క్షణం తీరిక లేకుండా గడిపారు.
అయితే రిలీజ్ డేట్ మారడంతో ఈ ఇద్దరు హీరోలు ఒత్తిడికి గురయ్యారని బోగట్టా.కొత్త ఏడాదిలో ఈ హీరోలు ఎవరినీ కలవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం.చరణ్ సోషల్ మీడియాలో నూతన సంవత్సరం శుభాకాంక్షలు కూడా చెప్పలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ సినిమా డైరెక్టర్ రాజమౌళి సైతం ఒత్తిడిగా ఫీలవుతున్నారని సమాచారం.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తై రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగి సినిమా రిలీజ్ వాయిదా పడటం ఇండస్ట్రీలో ఇదే తొలిసారి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కు అనుకూల పరిస్థితులు ఏర్పడాలని ఇండస్ట్రీ పెద్దలు కోరుకుంటున్నారు.ఎన్టీఆర్, చరణ్ తర్వాత ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.