టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోనే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం జరిగిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఆరోపించారు.ఆయన చేసిన అవినీతి జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ చీఫ్ పురంధేశ్వరికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
చేతికి వాచ్ కూడా లేదని చెప్పుకునే చంద్రబాబు కోట్ల రూపాయలు ఫీజు చెల్లించి న్యాయవాదులను ఎలా పెట్టుకున్నారో చెప్పాలని మంత్రి చెల్లుబోయిన అన్నారు.కక్ష సాధింపులకు పాల్పడాల్సిన అవసరం వైసీపీకి లేదని తెలిపారు.
సీఐడీ విచారణలో అన్ని వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.అవినీతిలో దొరికిపోయిన ఇంకా ప్రజల సానుభూతి పొందాలని చూస్తున్నారని విమర్శించారు.