పేటలో వండర్ కిడ్ యమా యువరాజ్...!

సూర్యాపేట జిల్లా: పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని కొందరు చిన్నారులను చూస్తే ఇట్టే అర్థమవుతుంది.వారు చిన్ననాటి నుంచే తమ ప్రతిభ పాటవాలను ప్రదర్శిస్తూ ఇతరులను ఆకట్టుకుంటారు.

అపారమైన జ్ఞాపకశక్తిని కలిగి ఉంటారు.తమ మేధాశక్తితో అబ్బురపరిచే విన్యాసాలు చేస్తుంటారు.

విజ్ఞాన శాస్త్రంలో అడుగిడుతూ తమ చిన్నారి మెదళ్లకు పదును పెడుతూ అవార్డులు పొందుతుంటారు.అలాంటి కోవకు చెందిన బుడతడే సూర్యాపేటకు చెందిన యమా యువరాజ్.

ఎమ్మెస్సార్ సెంట్రల్ స్కూల్ లో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారి యువరాజ్ చెపుతున్న సమాధానాలను చూసి అక్కడికి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆశ్చర్యానికి లోనయ్యారు.కార్యక్రమానికి హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు కూడా ఎలాంటి బెరుకు,భయానికి లోనవకుండా ప్రశ్న విన్న వెంటనే సమాధానాలు బాల మేధావి బుర్రలో నుంచి బుల్లెట్ల లాగా దూసుకు రావడంతో సంభ్ర మాశ్చర్యాలతో పాటు పాటు హర్షద్వానాలు,కరతాల ధ్వనులు మిన్నంటాయి.

Advertisement

సూర్యాపేట లోని ప్రముఖ విద్యా సంస్థ ఎమ్మెస్సార్ కిడ్స్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న యమ యువరాజ్ ప్రముఖ వ్యాపారవేత్త,సుమన్ మెడికల్ షాప్ యజమాని యమా ప్రభాకర్ పుష్పలతల మనుమడు,యమా ప్రమోద్ దీప్తిల చిన్న కుమారుడు.ఎనిమిది సంవత్సరాల వయసులోనే తన తోటి విద్యార్థులను ఉపాధ్యాయులను యమహా అనిపించేలా ఎమ్మెస్సార్ సెంట్రల్ పాఠశాలలో నిర్వహించిన ఈవెంట్ లో పాల్గొని జాతీయ పతాకాలను చూసి దేశాల పేర్లు,వాటి రాజధానుల పేర్లు చెప్పిన చిచ్చరపిడుగు.

క్యూబ్ విలువలను టకాటక చెప్పేసిన బాల మేధావి,ఎమ్మెస్సార్ కిడ్స్ విద్యార్థి యువరాజ్ ప్రథమ స్థానంలో నిలిచాడు.తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు.

తనకు విద్య నేర్పిన గురువుల ఆశీస్సులు పొందాడు.తన కన్నవారి ఆశలు ఆశయాలకు సజీవరూపంగా మారి ప్రత్యక్ష విజేతగా నిలిచి గెలిచాడు.

అజాతశత్రువుగా,ఆపదలో ఉన్న వారిని ఆదుకునే మానవత్వం గల వ్యక్తిగా సూర్యాపేటలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందిన తన తాత యమ ప్రభాకర్, నాయనమ్మ పుష్పలత, తాతయ్య,అమ్మమ్మ చకిలీల నాగరాజు,అలివేణిలతో పాటు తన కన్న తల్లిదండ్రులు యమ ప్రమోద్,దీప్తిలు కన్న కలలను నిజం చేస్తూ చిన్న వయసులోనే తన మేధాతనాన్ని నిరూపించుకున్నారు యమా యువరాజ్.విద్యా రంగంలో చిన్నతనంలోనే తన ప్రతిభను ప్రదర్శించి నిజంగా యువరాజు అనిపించుకున్న యమా యువరాజ్ భవిష్యత్తులో మరిన్ని కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి పెద్దలు, విద్యావంతుల ఆశీస్సులు, అభిమానం సంపాదించుకోవాలని,ఈ సందర్భంగా ప్రతివారు చిన్నారి యువరాజుకు అభినందనలు, ఆశీస్సులు అందించారు.

పోలింగ్ సరళిపై మాజీ మంత్రి కేటీఆర్ సమీక్ష
Advertisement

Latest Suryapet News