బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లు ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు అభిషేక్ బచ్చన్ ( Abhishek Bachchan ) ఒకరు.ఈయన బాలీవుడ్ నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.
ఇక ఈయన మాజీ ప్రపంచ సుందరి సినీ నటి ఐశ్వర్యరాయ్ ( Aishwarya Rai ) ని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ దంపతులకు ఆధ్య అనే కుమార్తె కూడా ఉంది.
ఇలా తమ వైవాహిక జీవితంలో వీరిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ తరచూ వీరిద్దరూ విడిపోతున్నారు అంటూ విడాకుల (Divorce) వార్తలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ విధంగా ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ విడాకుల వార్తలు వచ్చిన ప్రతిసారి అభిషేక్ బచ్చన్ వాటిని కొట్టి పారేస్తూ ఉన్నారు.మీరే నాకు రెండో పెళ్లి కూడా చేయాలి అంటూ ఈయన పరోక్షంగా తన విడాకుల వార్తలపై( Divorce Rumors ) కౌంటర్ ఇచ్చిన సంగతి కూడా మనకు తెలిసిందే.అయితే తాజాగా మరోసారి వీరి విడాకులు వార్తలు తెరపైకి వచ్చాయి అయోధ్య రామ మందిరం( Ayodhya Ram Mandir ) ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ సెలబ్రిటీలందరూ కూడా అయోధ్య చేరుకున్న సంగతి మనకు తెలిసిందే.
కొంతమంది సెలబ్రిటీ కపుల్స్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.అయితే అభిషేక్ బచ్చన్ కూడా ఈ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా అభిషేక్ బచ్చన్ మాత్రమే హాజరై ఐశ్వర్య లేకపోవడంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉండడం నిజమేనని, అందుకే అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐశ్వర్య లేకుండా అభిషేక్ హాజరయ్యారు అంటూ మరోసారి విడాకుల వార్తలను వైరల్ చేస్తున్నారు.