మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) మధ్యంతర బెయిల్ పై విడుదల కావడం ఆ పార్టీ నేతలకు సంతోషాన్ని కలిగించింది.చంద్రబాబును ఇక ఏ శక్తీ ఆపలేదంటూ టీడీపీ నేతలు( TDP ) ప్రచారం చేస్తుండగా ఇన్ని రోగాలు ఉన్న చంద్రబాబు ఏపికి అవసరమా అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.అయితే చంద్రబాబు బెయిల్ తో ( Chandrababu Bail ) పొలిటికల్ లెక్కలు మారతాయా? అనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2019 ఎన్నికల సమయానికి చంద్రబాబుపై ఊహించని స్థాయిలో వ్యతిరేకత ఉంది.అయితే ఇప్పుడు మాత్రం ఐదేళ్ల వైసీపీ పాలనపై( YCP ) ఒకింత వ్యతిరేకత ఉండటంతో చంద్రబాబు సీఎం కావాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.టీడీపీ జనసేన పొత్తు( TDP Janasena ) పెట్టుకున్నా కొన్ని జిల్లాల్లో వైసీపీ బలం ఏ మాత్రం తగ్గలేదు.
ఇప్పటికీ 2024లో వైసీపీ అధికారంలోకి రావచ్చని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.
చంద్రబాబుపై ప్రజల్లో సానుభూతి ఏర్పడితే మాత్రం 2024లో టీడీపీదే అధికారమని చరిత్ర సృష్టించే స్థాయిలో టీడీపీ ఫలితాలను సాధిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చంద్రబాబుపై సానుభూతి కలగకపోతే మాత్రం సంక్షేమ పథకాల అమలుతో( Social Schemes ) కొన్ని వర్గాల ప్రజల మనస్సు గెలుచుకున్న వైసీపీకి అధికారం దక్కనుంది.ఇప్పటికైతే రెండు పార్టీలకు విజయావకాశాలు సమానంగా ఉన్నాయి.
2024 లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏపీకి ఉన్న కొన్ని సమస్యలు పరిష్కారమైతే మాత్రమే వేగంగా అభివృద్ధి జరిగే ఛాన్స్ ఉంది.టీడీపీ జనసేన పొత్తు ఆ పార్టీలకు ప్లస్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.జనసేన కనీసం 40 నుంచి 50 స్థానాలలో పోటీ చేసే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది.త్వరలో టీడీపీ పూర్తిస్థాయి మేనిఫెస్టోను ప్రకటించనుందని సమాచారం అందుతోంది.
చంద్రబాబు రాబోయే రోజుల్లో కూడా సంచలనాలు సృష్టించాలని టీడీపీ నేతలు ఫీలవుతున్నారు.