కొల్లాపూర్ పర్యటనలో మార్పు.. ప్రియాంక స్థానంలో రానున్న రాహుల్ గాంధీ..!

తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న కొల్లాపూర్ పర్యటనలో మరోసారి మార్పులు చోటు చేసుకున్నాయి.పర్యటనకు రావాల్సిన ప్రియాంక స్థానంలో ఇప్పుడు రాహుల్ గాంధీ రానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

 Change In Kolhapur Tour.. Rahul Gandhi To Replace Priyanka..!-TeluguStop.com

షెడ్యూల్ ప్రకారం పాలమూరు ప్రజాభేరీ సభకు ప్రియాంక గాంధీ హాజరుకావాల్సి ఉంది.అయితే అనారోగ్య కారణాలతో చివరి నిమిషంలో ప్రియాంక గాంధీ పర్యటన రద్దు అయిందని తెలుస్తోంది.

దీంతో ప్రియాంక గాంధీ స్థానంలో రాహుల్ గాంధీ రాబోతున్నారని సమాచారం.అయితే ముందు అనుకున్న షెడ్యూల్ మేరకు కొల్లాపూర్, దేవరకద్రలో ప్రియాంక గాంధీ పర్యటిస్తారని తెలిపారు.

తరువాత స్వల్ప మార్పుల అనంతరం కొల్లాపూర్ సభకు మాత్రమే ఆమె హాజరవుతారని పార్టీ నేతలు చెప్పారు.తాజాగా ఆమె పర్యటన రద్దు అయిన నేపథ్యంలో రాహుల్ గాంధీ రానున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube