ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరపడింది.ఈ సమయంలో అధికార పార్టీ వైసీపీ( YCP ) ఇప్పటి వరకు తాము చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి జనాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించి, ఎన్నికల్లో అది తమకు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి.
అయితే ఆ విషయాలపై ఆ పార్టీ పెద్దగా ఫోకస్ పెడుతున్నట్టుగా కనిపించడం లేదు.ఇదే అదునుగా విపక్ష పార్టీలన్నీ ఏకమై వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.
ఏపీలో అభివృద్ధి జరగడం లేదనీ, జగన్( CM Jagan ) పాలనలో జనాలంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, తాము అధికారంలోకి వస్తే అభివృద్ధితో పాటు, పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అందిస్తామని ప్రచారం చేస్తున్నారు.ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) జగన్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
జగన్ పాలన రాతి యుగాన్ని తలపిస్తోందని ,స్వర్ణ యుగం రావాలంటే టిడిపి, జనసేన పాలన రావాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిస్తున్నారు.రద్దులు, గుద్దులు, నొక్కులు, కూల్చివేతలు, దాడులు, అక్రమ పనులు మినహాయిస్తే జగన్ పాలనలో ఏముందని చంద్రబాబు నిలదీస్తున్నారు.
అయితే దీనికి కౌంటర్ గా వైసీపీ నుంచి పెద్దగా రియాక్షన్ అయితే రావడం లేదు.

చంద్రబాబు చేస్తున్న విమర్శలను తిప్పుకొడుతూనే, తాము చేసిన అభివృద్ధి గురించి, సంక్షేమ పథకాలు( Welfare Schemes ) గురించి ప్రజలకు, తమపై విమర్శలు చేస్తున్న వారికి చెప్పుకునే విధంగా వైసిపి నేతలు ముందుకు రావడం లేదు.వైసీపీలో మంచి వాక్యాతుర్యం ఉన్న నేతలు చాలామంది ఉన్నారు.అయితే వారు పూర్తిగా సైలెంట్ గా ఉంటున్నారు.
ఏ విషయం పైన అయినా మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) లేదా ప్రభుత్వ సలహాలు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) మాత్రమే స్పందిస్తున్నారు.కానీ ప్రతిపక్షాలు చేసే విమర్శలు ప్రజల్లోకి ఎక్కువగా వెళుతూ వైసిపి ఇమేజ్ ను డామేజ్ చేస్తున్నాయి.

కనీసం చేసిన అభివృద్ధి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో వైసిపి ఉండడం ,గతంలో టిడిపి పాలనలో చోటు చేసుకున్న అక్రమాలు, అవినీతి గురించి ప్రజలకు అర్థమయ్యేలా వివరించకపోవడం,అవినీతి పెచ్చుమీరడం వల్లనే 2019 ఎన్నికల్లో టిడిపి 23 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని హైలెట్ చేసి చెప్పడంలో వైసిపి నాయకులు విఫలమవుతున్నట్లుగానే కనిపిస్తున్నారు.జగన్ కుటుంబం పైన టిడిపి విమర్శలు చేస్తోంది.వైఎస్ షర్మిల( YS Sharmila ) కాంగ్రెస్ లో చేరిక అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకుని టిడిపి సక్సెస్ అవుతుంది.టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు, ఆ పార్టీ కీలక నాయకులంతా జగన్ పాలనపై విరుచుకుపడుతున్నారు.
అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి, టిడిపి ఏపీ అధ్యక్షులు అచ్చెన్న నాయుడు తదితరులు సందర్భం వచ్చినప్పుడల్లా వైసీపీని విమర్శిస్తూ , జగన్ ది రాక్షస పాలన అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు.కానీ గట్టిగా వైసీపీ నుంచి రియాక్షన్ కనిపించడం లేదు.